జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తాజాగా గురువారం నిర్వహించిన కేంద్ర క్యాబినెట్లో ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. గతంలోనే జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని జమిలి ఎన్నికలకు వెళ్లాలని నివేదికను అందించింది.
కేంద్ర క్యాబినెట్ సమావేశం
జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తాజాగా గురువారం నిర్వహించిన కేంద్ర క్యాబినెట్లో ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. గతంలోనే జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని జమిలి ఎన్నికలకు వెళ్లాలని నివేదికను అందించింది. ఈ బిల్లును శుక్ర, శనివారాల్లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బిల్లుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంపీలందరూ అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే బీజేపీతోపాటు ఎన్డీఏ పక్షాలకు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలకు వెళ్లాలని ముందు నుంచి భావిస్తున్న బిజెపి అందుకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని కమిటీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని 18 వేల పేజీలతో నివేదిక సిద్ధం చేసి అందించింది. జమిలి ఎన్నికల వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని ఈ కమిటీ పేర్కొంది. ఆర్థికంగానూ దేశం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఈ కమిటీ వ్యక్తం చేసింది.
జమిలి ఎన్నికలు అమలు చేసే విషయంలో స్పష్టత వస్తే రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు పార్లమెంట్ స్థానాలకు, పంచాయతీలకు కూడా ఒకేసారి ఎన్నికలను నిర్వహించనున్నారు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపిస్తారు. సగానికిపైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్ట రూపం పొందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించాయి. బిజెపి, బిజెడి, జేడీయు, శివసేన వీటిలో ఉన్నాయి. వనరులు ఆధా కావడం, సామాజిక సామరస్యాన్ని కాపాడటం, ఏకకాలంలో దేశంలో అభివృద్ధి జరగటం జమిలి ఎన్నికలు వల్ల సాధ్యపడతాయని భావిస్తున్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని 83, 172 అధికరణలను సవరించాలని కమిటీ సూచించింది. దీనివల్ల రాష్ట్రపతి, గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్ సభ, అసెంబ్లీలు పదవీకాలం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది. ఈ బిల్లుకు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ లో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ ఉందే తప్ప పూర్తిస్థాయి మెజారిటీ లేదు.
రాజ్యసభలో 240 సీట్లు ఉండగా ఎన్డీఏ బలం 112 మాత్రమే. ప్రతిపక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్లు అవసరం ఉంది. లోక్ సభలో మొత్తం 547 స్థానాలు ఉండగా ఎన్డిఏ 292 సీట్లు ఉన్నాయి. 2/3 మెజారిటీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇక్కడే చిన్న మెలిక ఉంది. మొత్తం సభ్యులను పరిగణలోకి తీసుకోకుండా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 శాతం మంది మెజారిటీ సరిపోతుందనే నిబంధన ఉండటంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలకు కూడా అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయంతో ఉంది. అందుకు అనుగుణంగానే కేంద్ర క్యాబిట్లో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. రామ్నాథ్ కోవింద్ కమిటీకి కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలు వద్దు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. తాజాగా బిల్లు పెట్టేందుకు బిజెపి సిద్ధమవుతుండడంతో పార్లమెంట్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి సర్వత్ర నెలపొంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బిజెపి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఇదే మంచి తరుణం అనే భావిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్లమెంట్ లోని ఉభయ సభల్లో పూర్తిస్థాయి మెజారిటీ లేని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఈ బిల్లును పార్లమెంట్లో ఎలా నెగ్గించుకుంటుంది అన్నదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే 2027 నాటికి అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా బిజెపి సన్నద్ధమవుతోంది.