యూకే అమ్మాయిలు చాలా స్పీడ్.. 15 ఏళ్లకే లైంగిక చర్య, వెల్లడించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

ప్రపంచంలో అడ్వాన్సుడ్ దేశాల్లో యూకే ఒకటి. ఈ దేశం అనేక రంగాల్లో ముందంజలో ఉంది. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే అక్కడి అమ్మాయిల స్పీడు. అవును మీరు చదివింది కరెక్టే. ఈ దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా స్పీడ్ గా ఉంటున్నారట. ఈ దేశంలోని 15 ఏళ్లలో బాలికలు ఫాస్ట్ గా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది.

UK girls speed

యూకే అమ్మాయిల స్పీడు

ప్రపంచంలో అడ్వాన్సుడ్ దేశాల్లో యూకే ఒకటి. ఈ దేశం అనేక రంగాల్లో ముందంజలో ఉంది. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే అక్కడి అమ్మాయిల స్పీడు. అవును మీరు చదివింది కరెక్టే. ఈ దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా స్పీడ్ గా ఉంటున్నారట. ఈ దేశంలోని 15 ఏళ్లలో బాలికలు ఫాస్ట్ గా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఈ వయసులోనే శారీరక సంబంధాలను పెట్టుకునేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో అబ్బాయిలు చాలా వెనుకబడి ఉన్నట్లు వెల్లడించింది. శారీరక సంబంధాలు పెట్టుకుంటున్న సమయంలో బాలికలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అనుగుణమైన రక్షణ కవచాలను(కండోమ్స్) వాడకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ముఖ్యంగా లైంగిక వ్యాధులు, గర్భధారణ వంటి ఇబ్బందులు బాలికలను వేధిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

యూకేలో ఉన్న ఈ పరిస్థితుల వల్ల అక్కడ లైంగిక విజ్ఞానంపై మరింత ఎక్కువగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నట్లు పేర్కొంది. స్కూల్లో హెల్తీ బిహేవియర్ పై ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రీసెర్చర్లు మొత్తంగా 2,42,000 మందిని 42 దేశాల్లో 15 నెలలో ప్రశ్నించి ఈ నివేదిక సిద్ధం చేశారు. ఇది అత్యంత సుదీర్ఘంగా జరిగిన సర్వేగా ప్రపంచానికి సంస్థ ప్రకటించింది. 2014 - 2022 మధ్య ఈ అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సర్వేలో ఇంగ్లాండ్ లోని 15 ఏళ్ల బాలికల్లో 21 శాతం మంది శృంగార అనుభవాన్ని రుచి చూశారు. ఇతర దేశాల్లో యావరేజ్ గా ఇది 17 శాతం మాత్రమే ఉంది. ఇక శృంగారం చేసేటప్పుడు కండోమ్ వినియోగించామని చెప్పిన వారి సంఖ్య 48 శాతంగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే యావరేజ్ గా 57 శాతంగా ఉంది. ఒక రకంగా ఇంగ్లాండ్ యువతులకు వీటి గురించి అవగాహన తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మగ పిల్లల్లో 15 ఏళ్లలోపు శృంగారం చేసే వారి సంఖ్య బ్రిటన్ లో తగ్గిపోతుందని నివేదిక వెల్లడించింది. యూకేలో 18 శాతం మంది 15 నెలలకు మాత్రమే శృంగారం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇది నాలుగు శాతం తగ్గిపోయింది. అదే అన్ని దేశాల్లో కలిపితే యావరేజ్ 20 శాతం గా ఉంది. శృంగారంలో పాల్గొంటున్న 15 ఏళ్లలోపు యూకే బాలురు 21 శాతం మంది కండోమ్ వాడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ఈ గణాంకాలు యూకే భవిష్యత్ తరాన్ని కాస్త ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయని చెబుతున్నారు. అక్కడి పిల్లల్లో మరింత లైంగిక విజ్ఞానం పెంచాల్సి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్