||ఉరి సెక్టార్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం||
సరిహద్దులో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు మట్టుబెట్టారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలని బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలో ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, నియంత్రణ రేఖ వద్ద హత్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పులతో అప్రమత్తమైన బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంకా కొంతమంది ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం నేపథ్యంలో ఉగ్ర వేటను కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.