ప్రపంచానికి సవాల్ విసురుతున్న రోగాల్లో క్షయ మహమ్మారి ఒకటి. గత కొన్నాళ్లుగా క్షయ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. క్షయ రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోగ్రామ్స్ ను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతి తక్కువ ఖర్చుతో క్షయ నిర్ధారణ పరికరాన్ని ఐసిఎంఆర్ అభివృద్ధి చేసింది. సాధారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం సాంప్రదాయ పద్ధతుల ద్వారా టీబీని నిర్ధారించడానికి 42 రోజులు సమయం పడుతుంది.
టీబీ రోగి
ప్రపంచానికి సవాల్ విసురుతున్న రోగాల్లో క్షయ మహమ్మారి ఒకటి. గత కొన్నాళ్లుగా క్షయ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. క్షయ రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోగ్రామ్స్ ను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతి తక్కువ ఖర్చుతో క్షయ నిర్ధారణ పరికరాన్ని ఐసిఎంఆర్ అభివృద్ధి చేసింది. సాధారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం సాంప్రదాయ పద్ధతుల ద్వారా టీబీని నిర్ధారించడానికి 42 రోజులు సమయం పడుతుంది. కేవలం రూ.35 ఖర్చుతో రోగి కఫాన్ని పరీక్షించి క్షయ వ్యాధిని నిర్ధారించే కొత్త సాంకేతిక వ్యవస్థను ఐసిఎంఆర్ కు చెందిన అసోంలోని డిబ్రూగఢ్ ప్రాంతీయ కార్యాలయం అభివృద్ధి చేసింది. సిఆర్ఐఎఎస్పిఆర్ కేస్ - బేస్డ్ టీబీ డిటెక్షన్ సిస్టమ్' అని పిలిచే ఈ చిన్న పరికరం చాలా తేలికైంది. మూడు దశల్లో క్షయ నిర్ధారణ చేసే ఈ పరికరంతో రెండున్నర గంటల్లో ఏకబిగిన 1500 నమూనాలను పరీక్షించవచ్చునని ఐసిఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉన్న కొన్ని టీబీ నిర్ధారణ పద్ధతులు మెరుగైన ఫలితాలను అందిస్తున్నా సమయం, ఖర్చు ఎక్కువగా ఉంటోందని ఐసిఎంఆర్ అధికారి వెల్లడించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే సిఆర్ఐఎస్పిఆర్ - కేస్ 12ఏ ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థ మంచి పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. దీనికి విస్తృత మార్కెట్ ను కల్పించేందుకు అర్హులైన సంస్థలు, కంపెనీలు తయారీదారులకు ఈ టెక్నాలజీని బదిలీ చేయాలని ఐసిఎంఆర్ భావిస్తోంది. ఆసక్తి ఉన్న కంపెనీలు, సంస్థలు ముందుకు రావాలని ఆహ్వానించింది. వీటి తయారీకి ముందుకు వచ్చే సంస్థలకు ఐసిఎంఆర్ మార్గదర్శకత్వం సాంకేతిక సహకారం అందిస్తుందని ఐసిఎంఆర్ అధికారులు వెల్లడించారు.
భారీగా నమోదవుతున్న కొత్త కేసులు
టీబి రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోగ్రామ్స్ ను అమలు చేస్తోంది. 2030 నాటికి టిబిని భారతదేశం నుంచి పూర్తిగా పారద్రోలాలి అన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో టీబీ కేసులు కొత్తగా నమోదు అవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఏడాది రెండేళ్ల నుంచి కొత్త టీబీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనికి గల కారణాలపై ఐసిఎంఆర్ అధ్యయనం చేస్తోంది. టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వైద్య సేవలను అందించడం ద్వారా వేగంగా కోలుకునేలా చేయవచ్చన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందికి టీబి వ్యాధిగ్రస్తులను గుర్తించడంపై కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించి కోలుకునేలా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2030 నాటికి టీబి రహిత దేశాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రం అడుగులు వేస్తోంది.