||ప్రతీకాత్మక చిత్రం||
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని సర్వదర్శానికి 12 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం 12 గంటలు వేచి చూడల్సి వస్తోంది. మంగళవారం శ్రీవారిని 69,221 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,409 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని, తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 5.45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల కొండపైన డ్రోన్ సాయంతో శ్రీవారి వీడియోలు తీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
దీనిపైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించి వివరణ ఇచ్చారు. తిరుమలలో భద్రత కోసం యాంటీ డ్రోన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇది త్వరలోనే అత్యాధునిక ఆంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొని వీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. వీటిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత కోసం డ్రోన్లలో ఉండే కెమెరా పనిచేయకుండా ఆంటీ డ్రోన్ల సిస్టం ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.