తిరుమల సమాచారం.. సర్వ దర్శనానికి 14 గంటల సమయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ప్రతీకాత్మక చిత్రం ||

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. 18 కంపార్ట్‌మెంట్లు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో నిండిపోయింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కలగడానికి కనీసం 14 గంటలు సమయం పడుతుంది అని టీటీడీ వెల్లడించింది. ఇక స్వామివారి లడ్డు ప్రసాదం అంటే ఎంతో విశిష్టత ఉంది.

అయితే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు స్వామివారి లడ్డుని తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. అయితే లడ్డూల తయారీ కోసం టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డు తయారీని కంప్లీట్ గా ఆటోమేటిక్ చేయడానికి సన్నహాలు వేస్తున్నారు. ఈ ప్రాసెస్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని టీటీడీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ యంత్రాంగం కోసం 50 కోట్లతో జర్మనీ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ నుంచి టీటీడీ దిగుమతి చేస్తున్నట్లు తెలిపింది. ఈ యంత్రాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వామివారికి విరాళంగా అందజేస్తున్నారు. యంత్రం ద్వారా రోజుకు దాదాపు ఆరు లక్షల లడ్డూలను చేయవచ్చని టీటీడీ తెలిపింది.

ఇక శుక్రవారం స్వామివారిని 57,147 మంది దర్శించుకున్నారు. 26,094 మంది తలనీలాలు భక్తులు సమర్పించుకోగ, భక్తులు స్వామివారి కి సమర్పించుకున్న కానుకలు రూ. 3.78 లక్షలు వచ్చిందని టీటీడీ తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్