టీటీడీ సమాచారం ఇక మరింత సులభతరం.. అందుబాటులోకి టీటీడీ చాట్ బాట్

ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇటువంటివారు స్వామివారి సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరంతరం ఆసక్తి చూపిస్తుంటారు. స్వామివారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లను టిటిడి అధికారులు చేస్తున్నారు.

Tirumala Tirupati Devasthanam

తిరుమల తిరుపతి దేవస్థానం

ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ఇటువంటివారు స్వామివారి సమాచారాన్ని తెలుసుకునేందుకు నిరంతరం ఆసక్తి చూపిస్తుంటారు. స్వామివారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లను టిటిడి అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగానే చాట్ జిపిటి తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. దీని ద్వారా భక్తులు ఎటువంటి సమాచారాన్ని అయినా సులభంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిని కొద్ది రోజుల్లోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల తిరుమలలోని సమగ్ర సమాచారం భక్తులు కోరుకున్నప్పుడు అత్యంత వేగంగా అందించేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. 

విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలు..

టీటీడీ అధికారులు విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. తిరుమలలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అన్నప్రసాదాలు, లడ్డూలు మరింత నాణ్యంగా అందించనున్నట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. ఎన్డిడిబి విరాళంగా ఇచ్చిన రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో పేర్కొన్నారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయ మాడవీధులు అభివృద్ధి చేస్తామని, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో యువతలో భక్తి భావన పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. విజన్ 2047 కు అనుగుణంగా ప్రత్యేక లక్ష్యాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింకు రోడ్ల నిర్మాణం, సబ్వే నిర్మాణం, బస్టాండ్ల పునర్నిర్మాణం, భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తిరుమలలో భావనాల రూపకల్పన, టీటీడీలో ఉన్న 31 మంది హిందూ యాత్ర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం, లేదా విఆర్ఎస్ ఇవ్వాలన్న బోర్డు నిర్ణయం మేరకు చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. తిరుమలలో ఆక్రమణలకు పాల్పడుతూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు, హ్యాకర్లు, లైసెన్సుదారులు, అనధికార తట్టలపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించింది. ఆకాశగంగ, పాప వినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు చేపట్టిన హెచ్డిపిపి కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది టీటీడీ. తిరుమలలో ప్రైవేట్ క్యాంటీన్లో ధరల నియంత్రణ, పేరుపొందిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగింత, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం కల్పించడంతోపాటు వాసతి అందించేలా చర్యలు చేపడుతుంది. దర్శనం, వసతి, ప్రసాదాల దళారీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్