స్థానికులకు టిటిడి శుభవార్త.. స్వామివారి దర్శనానికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ

తిరుపతిలో ఉండే స్థానికులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్థానికులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుగుణంగా ప్రత్యేక మార్గదర్శకాలను టీటీడీ విడుదల చేసింది. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు స్థానిక ప్రజలు కూడా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు మాదిరిగానే ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది. దీనివల్ల స్థానికంగా ఉంటున్నప్పటికీ స్వామివారిని దర్శించుకోవడం కష్టంగా మారుతోందన్న భావన స్థానికుల్లో వ్యక్తం అవుతుంది.

Tirumala Tirupati Devasthanam

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుపతిలో ఉండే స్థానికులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్థానికులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుగుణంగా ప్రత్యేక మార్గదర్శకాలను టీటీడీ విడుదల చేసింది. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు స్థానిక ప్రజలు కూడా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు మాదిరిగానే ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది. దీనివల్ల స్థానికంగా ఉంటున్నప్పటికీ స్వామివారిని దర్శించుకోవడం కష్టంగా మారుతోందన్న భావన స్థానికుల్లో వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. స్థానికులు స్వామి వారిని దర్శించుకునేందుకు అనుగుణంగా వెసులుబాటును కల్పిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కొద్దిరోజుల కిందట టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో స్థానికులకు స్వామివారి దర్శనానికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించింది. ఈ సమావేశంలోనే స్థానికులకు స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. అందుకు అనుగుణంగానే స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించాలని టిటిడి నిర్ణయించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేసింది. డిసెంబర్ మూడో తేదీ నుంచి స్థానిక భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించి తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేయనున్నారు. మహతి ఆడిటోరియం, బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో ఈ టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య జారీ చేయనున్నారు. 

స్థానికుల దర్శనానికి ఇవే మార్గదర్శకాలు..

తిరుపతిలోని స్థానిక ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన టిటిడి అధికారులు ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేశారు. ముందుగా వచ్చిన వారికే తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం టికెట్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఫుట్పాత్ హాల్ (దివ్య దర్శనం) క్యూలైన్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డు ఉచితంగా అందిస్తారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజులు వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్