Hyderabad vijayawada TSRTC | హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ఈగరుడ బస్సు||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అందులో ముందుగా 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. మిగతా బస్సులను విడతల వారీగా ఈ ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని వివరించింది. ఈ బస్సులకు ఈ-గరుడ అని పేరు పెట్టినట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం రోజున మియాపూర్‌లోని బస్ పాయింట్ వద్ద ఈ బస్సులను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ-గరుడ విశేషాలు:

  • పొడవు - 12 మీటర్లు
  • సీట్లు - 41
  • ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్
  • రీడింగ్ ల్యాంప్
  • వెయికల్ ట్రాకింగ్ సిస్టం
  • ప్రతి సీటు వద్ద పానిక్ బటన్
  • బస్సులో 3 సీసీ కెమెరాలు
  • ప్రయాణికులను లెక్కించేలా ఆటోమేటిక్ ప్యాసింజర్ కౌంటర్ కెమెరా
  • బస్సుకు ముందు వెనకాల ఎల్‌ఈడీ బోర్డులు
  • బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం
  • ఒకసారి చార్జింగ్‌తో 325 కిలోమీటర్ల ప్రయాణం

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్