TSPSC | పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||టీఎస్‌పీఎస్సీ కార్యాలయం||


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కావడంతో అధికారులు రాబోయే పరీక్షలకు ప్రశ్నాపత్రం ప్రిపేర్ చేయడంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4 నుండి యధావిధిగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.  ఇప్పటివరకు రూపొందించిన ప్రశ్న పత్రాలను పక్కనపెట్టి కొత్త ప్రశ్న పత్రాలను రుపొందించాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే కొత్తగా రూపొందించే ప్రశ్న పత్రాలు ఎవరు తయారు చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ లో  ఎవరు ఎక్స్‌పర్ట్స్‌ అనే విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు టీఎస్‌పీఎస్సీ రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటివరకు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ లను తొలగించి కొత్త ఎక్స్‌పర్ట్స్‌ లను పేపర్ రూపొందించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే ఏప్రిల్ 4 తర్వాత నిర్వహించే పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తామని, వాయిదా వేసిన పరీక్షల తేదీల వివరాలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది తెలిసిందే.  మార్చ్ 5న నిర్వహించిన ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ కావడంతో టీఎస్‌పీఎస్సీ మార్చి 12న జరిగే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించవలసిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల కు నిర్వహించవలసిన పరీక్షలను వాయిదా వేసింది తెలిసిందే. ఈ పరీక్ష తేదీలను త్వరలో టీఎస్‌పీఎస్సీ ప్రకటించనుంది.


టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ 4 నుండి నిర్వహించే పరీక్షల వివరాలు : 

ఏప్రిల్‌ 4న :  హార్టికల్చర్‌ ఆఫీసర్‌,

ఏప్రిల్‌ 23న  : అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ 

ఏప్రిల్‌ 25న  : అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, 

ఏప్రిల్‌ 26, 27 తేదీల్లో :  గెజిటెడ్‌ ఆఫీసర్‌ (గ్రౌండ్‌ వాటర్‌), 

మే 7న  : డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌,

 మే 13న  : పాలిటెక్నిక్‌ లెక్చరర్‌,

 మే 15, 16 తేదీల్లో : నాన్‌ గజిటెడ్‌ ఆఫీసర్‌ (గ్రౌండ్‌ వాటర్‌), 

మే 17న :  ఫిజికల్‌ డైరెక్టర్స్‌, 

జాన్‌ 5 నుంచి 12  :  గ్రూప్‌-1 మెయిన్స్‌,

 జూలై 1న :  గ్రూప్‌ -4, 

ఆగస్టు 29, 30 తేదీల్లో :  గ్రూప్‌-2 పరీక్షలు యధావిధిగానే నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టంగా తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్