||హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం||
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజ్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా కలకాలం సృష్టిస్తోంది. అయితే ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో A2 గా జగిత్యాల జిల్లా వాసిని అరెస్ట్ చేశారు. ప్రశ్న ప్రశ్నాపత్రం లీకేజీ లో అట్ల రాజేశేఖర్ రెడ్డి అరెస్ట్ చేసి విచారణ కోసం పోలీసుల గ్రామానికి వెళ్లారు.
టీఎస్ పీఎస్సీలో కేసులో A2 గా అరెస్టు అయిన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామం అట్ల రాజేశేఖర్ రెడ్డి టీఎస్ పిఎస్సీలో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తున్నారు. తమ గ్రామలోని వ్యక్తిని పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంలో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పరీక్షల నిర్వహణకు అందించిన వెబ్ సైట్లు హ్యాక్ చేయడం, ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం లాంటి కేసులలో తమ గ్రామ వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఉండడం ఏదో బలమైన కారణం ఉంటుందని గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒత్తిడికి లోనై ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని కానీ, రాజశేఖర్ రెడ్డి అలాంటివాడు కాదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజ్ కేసులో మరిన్ని క్లూస్ కోసం పోలీసులు విచారిస్తున్నారు.