ఉసిరి రసాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. ఉసిరిలో ఉండే అనేక ఔషధ గుణాలు చర్మం వృద్ధాప్య ఛాయను సంతరించుకోకుండా చేస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉసిరి రసాన్ని రాత్రిపూట తాగడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. రాత్రిపూట ఉసిరి రసాన్ని తాగితే జలుబు, గొంతు నొప్పి వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉసిరికాయ జ్యూస్/రసం తాగడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఉసురు జ్యూస్ తయారీ కూడా చాలా సులభం.
ఉసిరికాయ
వృద్ధాప్యం ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుభవించాల్సిన దశ. అయితే కొంతమంది యవ్వనంలోనూ వృద్ధాప్య ఛాయలతో బాధపడుతుంటారు. ఉద్యోగపరమైన ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం, పోషకాహార లేమి వంటి అనేక అంశాలు చర్మ ఆరోగ్యం పాడవ్వడానికి కారణమవుతుంటాయి. అయితే, కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా 60 ఏళ్ల తర్వాత కూడా వృద్ధాప్య ఛాయలు కనిపించని మృదువైన శర్మాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో తాజా పండ్ల రసం కీలకంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. ఎటువంటి జ్యూసులు తీసుకోవాలన్నది కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. ఉసిరిలో ఉండే అనేక ఔషధ గుణాలు చర్మం వృద్ధాప్య ఛాయను సంతరించుకోకుండా చేస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉసిరి రసాన్ని రాత్రిపూట తాగడం వల్ల ఇబ్బందులు ఉంటాయి.
రాత్రిపూట ఉసిరి రసాన్ని తాగితే జలుబు, గొంతు నొప్పి వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉసిరికాయ జ్యూస్/రసం తాగడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఉసురు జ్యూస్ తయారీ కూడా చాలా సులభం. రెండు నుంచి మూడు ఉసిరికాయలు తీసుకొని కడిగి కట్ చేసుకోవాలి. దానిని సగం నుండి ఒక గ్లాసు నీటితో కలపాలి. బాగా కలిపి మిక్సీ చేయాలి. ఆ తర్వాత వడకట్టాలి. ఈ రసాన్ని గుజ్జుతో కలిపి తాగవచ్చు. ఇలా చేయడం వల్ల ఫైబర్ పెరుగుతుంది. దాని పులుపును సమతుల్యం చేయడానికి నల్ల మిరియాల పొడిని కలుపుకోవాలి. దానికి కొంచెం తేనె వేసి తరువాత తీసుకోవాలి. ఉసిరికాయలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాల్షియానికి మూలం. ఉసిరి రసం బోలు ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా ప్రభావంతంగా పని చేస్తుంది. ఈ వ్యాధిలో ఎముకలు వాటి బలాన్ని కోల్పోతాయి. ఎముకలు విరిగిపోయే ప్రమాదం పెరుగుతోంది. ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని ఉసిరి రసం కల్పిస్తుంది. ఉసిరి రసం గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. కొన్ని అధ్యయనాలు దాని వినియోగం అధరోజెనిక్ సూచికను తగ్గిస్తుందని వెల్లడిస్తున్నాయి. నాన్ కొలెస్ట్రాల్ చేరడం వల్ల నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఉసిరి రసంలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను పెంచుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాధులను అరికట్టడానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉసిరి జ్యూస్ ను తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతోపాటు యవ్వనంగా ఉండేందుకు దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.