అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకొని తాజాగా ఆయన భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయాన్ని గతంలో ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకొని తాజాగా ఆయన భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్ల సాయాన్ని గతంలో ప్రకటించింది. ఈ సాయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన ట్రంప్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయాన్ని నిలిపివేతకు సంబంధించిన ఫైల్ పై ట్రంప్ తాజాగా సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారతదేశాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సహాయం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాపై వాళ్లు భారీగా పనులు వేస్తున్నారని పేర్కొన్నారు. తనకు భారతదేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని పేర్కొన్నారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే వాహనాలపై ఏప్రిల్ రెండో తేదీ నుంచి 25% సుంకం విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తాజాగా ట్రంపు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొద్దిరోజుల కిందటే అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లి వచ్చిన తర్వాత కూడా అమెరికా చర్యలు మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అమెరికాలో ఉంటున్న భారతీయులను యుద్ధ విమానంలో చేతులకు బేడీలు వేసి మరి భారతకు తీసుకువచ్చారు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ట్రంప్ భారత్ వద్ద డబ్బులు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరు అడిగితే దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా సాయం అందించాలని నిర్ణయించిందో తెలియజేయాలంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సాయాన్ని నిలుపుదల చేయడం పట్ల అమెరికా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నప్పటికీ దీని గురించి భారత్ లో మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు.
ట్రంప్ ప్రభుత్వం ఒక్క భారతదేశనికే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు వివిధ రూపాల్లో ఇస్తున్న సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే చర్యల్లో భాగంగానే ఇటువంటి నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసిన వెంటనే ఎలాన్ మస్క్ నేతృత్వంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డివోజిఈ) భారతదేశానికి అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు అందించే సాయం కూడా అమెరికా ప్రభుత్వం కొత్తూరు తగ్గించుకోవడంలో భాగంగా నిలిపివేసింది.