అమెరికాలోని భారతీయ వలసదారులపై నూతనంగా ఎంపికైన ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారతీయులపై ట్రంప్ ఉక్కు పాదాన్ని మోపేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది భారతీయ విద్యార్థులను యుద్ధ విమానాల్లో భారతదేశానికి తరలించిన ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికాలోని గ్రీన్ కార్డుదారుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలించేందుకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రంప్ సన్నిహితులు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సహకారంతో వారి సామాజిక మాధ్యమ ఖాతాలను వడపోయడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నిఘా పెట్టాలని ట్రంప్ నిర్ణయించారు.
ట్రంప్
అమెరికాలోని భారతీయ వలసదారులపై నూతనంగా ఎంపికైన ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారతీయులపై ట్రంప్ ఉక్కు పాదాన్ని మోపేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది భారతీయ విద్యార్థులను యుద్ధ విమానాల్లో భారతదేశానికి తరలించిన ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికాలోని గ్రీన్ కార్డుదారుల ప్రతి కదలికను నిశితంగా పరిశీలించేందుకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రంప్ సన్నిహితులు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సహకారంతో వారి సామాజిక మాధ్యమ ఖాతాలను వడపోయడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నిఘా పెట్టాలని ట్రంప్ నిర్ణయించారు. మరోవైపు వలస చట్టాలకు పదును పెడుతూ ఇతర దేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి వచ్చే హెచ్1 బీ వీసాదారులను విమానాశ్రయాల్లోనే అడ్డుకొని కఠినమైన తనిఖీలతోపాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గ్రీన్ కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి హక్కు ఉండదని దేశ ఉపాధ్యక్షులు జేడీ వాన్సు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న వలసదారులు.. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తిపోతున్నారు.
అమెరికాలో నివసించే గ్రీన్ కార్డుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని ట్రంప్ యంత్రాంగం త్వరలో ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన పౌరులు అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడే తమ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను వెల్లడించడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు ఈ నిబంధనను వర్తింపజేయాలని భావిస్తున్నారు. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ భారత్, అమెరికా రాజకీయ చర్చల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయులపై ఈ ప్రతిపాదనలు ప్రభావం చూపుతాయి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యవసానాలపై ఆందోళనతో రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను ఆన్లైన్లో స్వేచ్ఛగా వ్యక్తం చేసే పరిస్థితి లేకుండా పోతుందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన పై మే 5వ తేదీ వరకు యుఎస్సిఐఎస్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది.
గ్రీన్ కార్డు, హెచ్- 1బీ, ఎఫ్-1 వేషాలు కలిగిన భారతీయ వలసదారులు విదేశాలకు వెళ్లి, వచ్చే సమయాల్లో భద్రతాపరమైన తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు సూచించారు. ఈ మేరకు ట్రావెల్ రిస్కు అడ్వైజరి జారీ చేశారు. భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా 43 దేశాల పౌరుల ప్రయాణాలను పరిమితం చేయాలని ట్రంపు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ జాబితాలో భారత్ లేకపోయినా కూడా అమెరికా వెలుపల ప్రయాణాలు చేసే భారతీయులు కఠినమైన తనిఖీలతో వేశా స్టాంపింగ్ లో జాప్యంతో పాటు విమానాశ్రయాల్లో అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగం, వీసా పునరుద్ధరణ కోసం బయట దేశాలకు వెళ్లేవారు ఊహించని అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటివరకు ట్రంప్ విజయం కోసం పనిచేసిన ఎంతోమంది భారతీయులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.