ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్, మస్క్ కు ఎదురుదెబ్బ.. చెల్లుబాటు కాదన్న కోర్టు

అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ డోజ్ విభాగ బాధ్యతలను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. ఆయన ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు అనేకమంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు. ఈ నిర్ణయం పై పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల నుంచి తొలగించిన వేలమంది ఫెడరల్ ఉద్యోగులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి విలియమ్స్ అల్సప్ ఆదేశాలను జారీ చేశారు.

Donald Trump, Elan Musk

డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధితులు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాల్లో కొన్ని తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. అటువంటి నిర్ణయాల్లో డోజ్ ఒకటి. అమెరికాలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను డోజ్ విభాగం తొలగిస్తూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ డోజ్ విభాగ బాధ్యతలను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. ఆయన ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు అనేకమంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నారు. ఈ నిర్ణయం పై పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల నుంచి తొలగించిన వేలమంది ఫెడరల్ ఉద్యోగులను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని కాలిఫోర్నియా ఫెడరల్ న్యాయమూర్తి విలియమ్స్ అల్సప్ ఆదేశాలను జారీ చేశారు. ఆరు ఫెడరల్ ఏజెన్సీల నుంచి తొలగించిన ఉద్యోగులను తక్షణమే వీధిలోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగాల్లో ప్రదర్శన ఏం బాగోలేదని చెబుతూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోనే డోజ్ విభాగం వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇదంతా బూటక చరిగా అభిప్రాయపడిన జడ్జ్ విలియమ్స్ వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. చట్టానికి విరుద్ధంగా ఉద్యోగులను తొలగించారంటూ ఓపియం ఆదేశాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు కొందరు కోర్టును ఆశ్రయించారు. ఓపియం చర్యలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమేనని, అత్యవసర సిబ్బందిని తొలగించలేదని న్యాయశాఖ వాదనలు వినిపించింది. ఈ వాదనాలతో ఏకీభవించని జడ్జ్ విలియమ్స్ ఆల్ సన్.. తక్షణమే ఆయా ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. సైన్య వ్యవహారాలు, వ్యవసాయం, రక్షణ, ఖజానా శాఖ ఎలా మొత్తం 6 శాఖలకు చెందిన ఉద్యోగులను వీధిలోకి తీసుకోవాలని ఆదేశించారు.

ఈ ఆదేశాలన్నీ అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల తొలగింపు తనను బాధించిందని, కానీ వాళ్లలో చాలామంది పనిచేయలేకపోయారని, అందుకే ఉత్తమ ప్రదర్శన ఉన్న వారిని మాత్రమే కొనసాగిస్తున్నామని ట్రంపు తాజాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కాలిఫోర్నియా జడ్జ్ ఈ ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆదేశాలను ఇచ్చిన జడ్జ్ ఎవరు అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 79 ఏళ్ల విలియమ్స్ ఆల్ సన్ సీనియర్ న్యాయమూర్తి. హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పూర్తి చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి విలియం డగ్లస్ కు 1971-72 మధ్య క్లర్కుగా పనిచేశారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోలినా నార్త్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేశారు. 2021 జనవరిలో సీనియర్ హోదా దక్కింది.  ఈ క్రమంలో ఈ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు వేలాదిమంది ఉద్యోగుల్లో భరోసాను నింపడంతో పాటు అమెరికాలో సరికొత్త చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి అమెరికాకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దూకుడుకు కోర్టులు ముకుతాడు వేస్తాయన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్