గుల్లబారుతున్న ఎముకలతో ఇబ్బందే.. ఈ సమస్య బాధితుల్లో వారే ఎక్కువ.!

కాలు జారి పడినా ఎముక విరిగిపోవడం, చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్లు కావడం.. వంటి లక్షణాలన్నీ గుల్ల బారుతున్న ఎముకల సమస్యకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీనినే ఆస్టియో పోరోసిస్ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వృద్ధాప్యంలో వేధిస్తూ ఉంటుంది. కానీ మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, అన్ని రకాల అలవాట్లు వల్ల చిన్న వయసు వారిని కూడా ఈ సమస్య వేధిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Osteoporosis

ఆస్టియో పోరోసిస్

కాలు జారి పడినా ఎముక విరిగిపోవడం, చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్లు కావడం.. వంటి లక్షణాలన్నీ గుల్ల బారుతున్న ఎముకల సమస్యకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. దీనినే ఆస్టియో పోరోసిస్ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వృద్ధాప్యంలో వేధిస్తూ ఉంటుంది. కానీ మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, అన్ని రకాల అలవాట్లు వల్ల చిన్న వయసు వారిని కూడా ఈ సమస్య వేధిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా మెనోపాజ్ దశకు వచ్చిన మహిళల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ మహిళల్లో మెనోపాజ్ దశలో తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుదల వల్ల ఎముకుల సాంద్రత తగ్గిపోయి గుల్లబారుతుంటాయి. దీనివల్ల మహిళల్లో హిప్, స్పైన్, రెస్ట్ ఫ్యాక్చర్స్ ఎక్కువగా అవుతుంటాయని ఎముకుల వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే వ్యాయామం చేయాలి. ఎముకల సాంద్రతను పెంచే కాల్షియం డిపాజిట్ అయ్యే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.

సూర్య రశ్మి శరీరానికి తగిలేలా జాగ్రత్త పడాలి. కొందరిలో పోషకాహార లోపం, మల్టీబుల్ మైలోమా, బోన్ ట్యూమర్స్ వంటి ఇబ్బందులు యుక్త వయసు వారిలోనూ ఈ సమస్య కనిపించేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. యుక్తవయస్కులు వారిలో ఈ సమస్య కనిపించకుండా ఉండాలంటే తప్పనిసరిగా 14 15 ఏళ్ల వయసులో కాల్షియం ఎక్కువగా శరీరంలోకి డిపాజిట్ అయ్యేలా చూసుకోవాలి. దీనివల్ల వయసు పెరుగుతున్న సమయంలో ఈ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.  ఎముకల గొల్లభారే సమస్య సాధారణంగా వృద్ధాప్యంలో అధికంగా కనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలు, ఆస్తమా, కీళ్లవాతానికి వినియోగించే మందులు, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిన రోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. వీటితోపాటు కాల్షియం లోపం ఎక్కువగా ఉన్న వారిలోనూ, థైరాయిడ్ సమస్య ఉన్నవారిలోనూ, ప్రమాదాలు ఇతర అనారోగ్య కారణాలు వల్ల ఎక్కువ రోజులు పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన వారిలోనూ తక్కువ వయసులోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్