|| ప్రతీకాత్మక చిత్రం ||
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల సంఖ్యను విడుదల చేసింది. జనవరి 1 వ తేదీ వరకు మనదేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 94,50,25,694 నమోదయ్యాయి. ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ప్రకారం ఓటర్ల సంఖ్య 67 శాతం మాత్రమే నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా, ఈ సంవత్సరంలో రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటర్లు స్వాతంత్రం తర్వాత నమోదైన ఓటర్లతో పోలిస్తే ఇప్పుడు ఆరు రేట్ల ఓటర్ల సంఖ్య పెరిగిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి సార్వత్రిక ఎన్నికలనాటికి దేశంలో 17.32 కోట్ల అయితే ఇప్పుడు 94.50 కోట్లకు చేరుకుంది.
1951 సార్వత్రిక ఎన్నికల ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు, 45.67 శాతం ఓటింగ్ నమోదైంది.
2014 సార్వత్రిక ఎన్నికల ఓటర్ల సంఖ్య 83.40 కోట్లు, ఇందులో 66.44శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలనాటికి ఓటర్ల సంఖ్య 91.20 కోట్లకు చేరుకుంది. ఓటింగ్ శాతం 67శాతం నమోదైంది.
2023 జనవరి 1వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరుకుంది.