హైవేపై టోల్ కడుతున్నారా.. మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివీ..

toll company responsibilities | స్టేట్, నేషనల్ హైవేలపై వెళ్తుంటే ప్రతి 60 కిలోమీటర్లకు మనకు ఒక టోల్ గేట్ Toll Gate అడ్డం పడుతుంది. టోల్ ఫీజు చెల్లించాకే మన వాహనం ముందుకు కదులుతుంది.

toll gate facilities

ప్రతీకాత్మక చిత్రం

స్టేట్, నేషనల్ హైవేలపై వెళ్తుంటే ప్రతి 60 కిలోమీటర్లకు మనకు ఒక టోల్ గేట్ Toll Gate అడ్డం పడుతుంది. టోల్ ఫీజు చెల్లించాకే మన వాహనం ముందుకు కదులుతుంది. వాహనాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. అయితే, మనం దేనికోసం టోల్ కడుతున్నామో చాలామందికి తెలియదు. అసలు టోల్ ఎందుకు చెల్లించాలి? అన్నదీ చాలామందికి తెలియదు. తమకు అవసరం లేదన్నట్టు ఉంటారు. రోడ్డు నిర్మాణం, దాని మెయింటెనెన్స్ కోసం టోల్ వసూలు చేస్తుంటారు. ఒక విధంగా దాన్ని ట్యాక్స్ అనుకోవచ్చు. ఈ టోల్ ఫీజును ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. దాని ప్రకారమే టోల్ ఫీజులను ఆయా సంస్థలు వసూలు చేస్తుంటాయి. ఒకసారి టోల్ రోడ్డుపైకి ఎక్కాక.. మనం ఎంత దూరం టోల్ రోడ్డుపై ప్రయాణిస్తున్నామన్నది లెక్క ఉండదు. టోల్ రోడ్డు ఎక్కితే టోల్ చార్జీ చెల్లించాలి. ఈ టోల్ చార్జీని రోడ్డుపై ప్రయాణించినందుకే కాదు.. పలు సేవలకు కూడా చెల్లిస్తున్నట్లే లెక్క. ఇందులోనే పలు సేవలను ఉచితంగా పొందవచ్చు.

టోల్ చార్జీ చెల్లింపుతో అదనపు ప్రయోజనాలు ఇవీ..

- టోల్ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనం అకస్మాత్తుగా ఆగిపోతే, దాన్ని లాగడం, తీసుకెళ్లడం టోల్ కంపెనీ బాధ్యత.

- ఎక్స్‌ప్రెస్ హైవేలో వెళ్తుండగా వాహనంలో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే, వాటిని అందించటం టోల్ కంపెనీ బాధ్యతే. 1033కి కాల్ చేస్తే పది నిమిషాల్లో సాయం అందిస్తారు. 5-10 లీటర్ల పెట్రోల్ ఉచితంగా అందిస్తారు. బ్యాటరీ చార్జింగ్ పెడతారు.

- వాహనం పంక్చర్ అయినప్పటికీ సహాయం కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చు.

- వాహనం ప్రమాదంలో చిక్కుకున్నా టోల్ రసీదుపై ఇచ్చిన ఫోన్ నంబర్‌ను సంప్రదిస్తే సాయం అందుతుంది

- వాహనంలో ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే, ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు.. అంబులెన్స్ సదుపాయాన్ని టోల్ కంపెనీయే కల్పిస్తుంది. ఈ సేవలన్నీ అందించటం టోల్ కంపెనీ బాధ్యత. ఈ సేవలు పొందటం వాహనదారుల హక్కు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్