విద్యుత్ ఛార్జీలపై నేడు వైసిపి పోరుబాట.. ర్యాలీలు, ఆందోళనలకు వైసిపి సన్నద్ధం

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట పడుతోంది. ఇప్పటికే రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన నిర్వహించిన వైసిపి తాజాగా.. విద్యుత్ చార్జీలు పెంపునకు సంబంధించి పోరాటానికి సన్నద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కరెంటు చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై మోపిన తీరును ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో వైసిపి శుక్రవారం ఆందోళన చేపట్టనుంది.

Inauguration of electricity fight poster

విద్యుత్ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ (ఫైల్ ఫోటో)

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట పడుతోంది. ఇప్పటికే రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన నిర్వహించిన వైసిపి తాజాగా.. విద్యుత్ చార్జీలు పెంపునకు సంబంధించి పోరాటానికి సన్నద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కరెంటు చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని ప్రజలపై మోపిన తీరును ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో వైసిపి శుక్రవారం ఆందోళన చేపట్టనుంది. ఆయా జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరఫున నిరసనను తెలియజేయడంతో పాటు ర్యాలీగా వెళ్లి కరెంటు చార్జీలు చేయడం తగ్గించాలని వినతిపత్రం అందజేయనున్నారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ కార్యాలయాలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం అధికారులకు వినతి పత్రాలను సమర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా కార్యాలయం చుట్టూ నిరసనను తెలియజేస్తారు. 

ఈ నిరసన కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ ఇప్పటికే ఆదేశించింది. నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాలు ఇన్చార్జులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నేతలు ఏర్పాట్లు చేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింతగా పోరాటం చేస్తామని వైసిపి నాయకులు చెబుతున్నారు. విద్యుత్ చార్జీలపై పోరాటం అనంతరం విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ జనవరి నెల మొదటి వారంలో మరో ఆందోళన కార్యక్రమానికి వైసిపి పిలుపునిచ్చింది. ఎన్నికల్లో ఓటమి పాలై ఆరు నెలలు కూడా గడవకముందే వైసిపి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయా జిల్లా కేంద్రాల్లో వైసిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్