నేడు టిపిసిసి చలో రాజ్ భవన్.. హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంసమైన అంశంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ నిరసనకు పిలుపునివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమం జాతీయస్థాయి రాజకీయాలకు సంబంధించినదిగా చెబుతున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంసమైన అంశంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీ నిరసనకు పిలుపునివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ కార్యక్రమం జాతీయస్థాయి రాజకీయాలకు సంబంధించినదిగా చెబుతున్నారు. అలా అని ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశమంతటా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వహిస్తోంది. అలా అనే గ్రూప్ పై అమెరికాలో వెలుగు చూస్తున్న అవినీతి ఆరోపణలతో భారత ఆర్థిక వ్యవస్థ పరువు దెబ్బతిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. గడచిన కొన్నాళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలను కేంద్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. అదే సమయంలో మణిపూర్ లో హింస చెలరేగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేంద్రం పట్టించుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశంతోనే కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతలు నిరసనలో భాగంగా చలో రాజభవన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందిరా పార్క్ లోనే ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించింది. అక్కడ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ర్యాలీగా సాగనున్నారు. ఈ నిరసనలో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొంటుండడం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారిగా పలువురు చెబుతున్నారు. దీనిపట్ల ప్రస్తుతం సర్వత్ర రాజకీయంగా చర్చ జరుగుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్