నేడు కప్పట్రాళ్ళకు శాస్త్రవేత్తలు, అధికార యంత్రాంగం.. యురేనియం తవ్వకాలపై చర్చలు

యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులతో చర్చించేందుకు శాస్త్రవేత్తలతో కూడా బృందంతో పాటు రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు సోమవారం కప్పట్రాళ్ళకు వెళుతున్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న ఆయా గ్రామాల ప్రజలతో ఈ బృందాలు చర్చలు జరుపుకున్నాయి. కప్పట్రాళ్ల ప్రజలైతే శనివారం తమన తాము స్వీయ నిర్బంధం చేసుకోవడంతోపాటు గ్రామంలోనికి ఎవరూ రాకుండా అడ్డంగా ముళ్ళ కంచెలు వేశారు.

People protesting against uranium mining

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలు

గడచిన కొద్ది రోజులుగా యురేనియం తవ్వకాలు జరప వద్దంటూ కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల 12 గ్రామాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే కప్పట్రాళ్లలో సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులతో చర్చించేందుకు శాస్త్రవేత్తలతో కూడా బృందంతో పాటు రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ అధికారులు సోమవారం కప్పట్రాళ్ళకు వెళుతున్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న ఆయా గ్రామాల ప్రజలతో ఈ బృందాలు చర్చలు జరుపుకున్నాయి. కప్పట్రాళ్ల ప్రజలైతే శనివారం తమన తాము స్వీయ నిర్బంధం చేసుకోవడంతోపాటు గ్రామంలోనికి ఎవరూ రాకుండా అడ్డంగా ముళ్ళ కంచెలు వేశారు. ఆయా గ్రామాల ప్రజలకు మద్దతుగా రాజకీయ నాయకులు వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేశారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతినడంతోపాటు ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుందన్న ఉద్దేశంతో ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే విరూపాక్షి కూడా మద్దతు తెలియజేశారు. 

ఈ వివాదానికి సంబంధించి అసలు విషయాన్నీ పరిశీలిస్తే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల వంటి గ్రామాలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాయి. ఆయా గ్రామాల సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలకు 468.25 హెక్టార్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. యురేనియం తవ్వకాలు మొదలుపెడితే అడవులతోపాటు పర్యావరణం, మీరు కలుషితం అవుతాయంటూ కప్పట్రాళ్లతోపాటు 12 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే ఈ 12 గ్రామాలతో పాటు మరో 13 గ్రామాలపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకునేందుకు శాస్త్రవేత్తలతో కూడిన అధికార యంత్రాంగం కప్పట్రాళ్ల గ్రామానికి సోమవారం చేరుకోబోతోంది. ఈ సమావేశంలో ప్రజలు చెప్పే అంశాలను అధికారులతో కూడిన శాస్త్రవేత్తల బృందం పరిగణలోకి తీసుకుంటుందా, ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతోంది అన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభమయ్య అవకాశం ఉంది. కప్పట్రాళ్లతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రజలు తమకున్న సందేహాలను తెలియజేయవచ్చని అధికారులు కూడా కోరుతున్నారు. ప్రజల సందేహాలు నివృత్తి చేస్తారా.? ఆయా గ్రామాలు ప్రజలు కోరుతున్నట్లు యురేనియం తవ్వకాలను నిలిపివేస్తారా అన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్