మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నారు. రాజ్ భవన్ లోని ప్రాంగణంలో నిర్వహించే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారధులు హాజరుకానున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాకూటమి ప్రభుత్వంలో 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మహారాష్ట్రలోని మహాయుతి అగ్రనేతలు
మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించనున్నారు. రాజ్ భవన్ లోని ప్రాంగణంలో నిర్వహించే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారధులు హాజరుకానున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాకూటమి ప్రభుత్వంలో 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో బిజెపికి చెందిన 21 మంది, శివసేనకు చెందిన 12 మంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పదిమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి, శివసేన, అజిత్ పవర్ కు చెందిన ఎన్సీపీ ల నుంచి మంత్రి పదవులు పలువురు కీలక నేతలకు దక్కనున్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు అవకాశాలు దక్కునున్నట్లు చెబుతున్నారు. ఈ మంత్రి పదవులు కేటాయించనున్న నేతలకు సంబంధించి సుదీర్ఘంగా ముఖ్య నేతలు సమాలోచనలు జరిపారు. అనంతరం వీరికి మంత్రి పదవులు కేటాయింపులు జరిగినట్లు చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కించుకుంటున్న వారిలో బిజెపి నుంచి.. మంగళ్ ప్రభాస్ లోధా, ఆశిష్ శలార్, ఆతులు బత్కల్కర్, రవీంద్ర చవాన్, నితీష్ రాణే, శివేంద్ర సింహరాజే బోసలే, గోపీచంద్ పదాల్కర్, మాధురి మిషల్, రాధాకృష్ణ వికే పాటిల్, చంద్రశేఖర్ బవాన్కులే, సంజయ్ కుటే, గిరీష్ మహాజన్, జై కుమార్ రావల్, అతుల్ సవే, పంకజ ముండే మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
మిగిలిన మంత్రులకు సంబంధించిన పేర్లపై స్పష్టత రావాల్సి ఉంది. శివసేన నుంచి మంత్రి పదవులను దక్కించుకున్న వారిలో ముఖ్య నేతలు 12 మంది ఉన్నారు. ఉదయ్ సమంత్, శంభు రాజే దేశాయ్, గులాబ్ రావు పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, సంజయ్ శిర్షత్, భరత్ శేత్ గోగా వాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ఉన్నారు. ఎన్సీపీ నుంచి మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో చగన్ భుజ బల్, అదితి తత్కేర్, అనిల్ పాటిల్, సంజయ్ బన్సైడ్, అజిత్ పవర్, మకరంద పాటిల్, నరహరి జర్వాల్, ధనంజయ్ ముండే, సనామాలిక్, ఇంద్రనీల్ నాయక్ ఉన్నారు. వీరంతా నూతన మంత్రివర్గంలో బాధ్యతలను చేపట్టనున్నారు. మహాయుతి ప్రభుత్వ క్యాబినెట్లో బిజెపి నుంచి 21 మంది, శివసేన నుంచి 12 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది మంత్రులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్ భవన్ లోని లాన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1991లో శివసేన విడిపోయిన తర్వాత నాగపూర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 33 ఏళ్ల తర్వాత నాగపూర్ లో మళ్ళీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.