పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఫోర్డా ( ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆదివారం లేఖ రాసింది. హత్యాచార ఘటనపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర సహాయ మంత్రి చేశారు.
నిరసన తెలియజేస్తున్న జూనియర్ వైద్యులు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఫోర్డా ( ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఆదివారం లేఖ రాసింది. హత్యాచార ఘటనపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర సహాయ మంత్రి చేశారు. వైద్యులకు రక్షణ కల్పించడంతోపాటు వైద్యులపై దాడులు చేసే వారిపై, ఈ తరహా అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తో వైద్యులు నిరసనకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే హత్యాచార ఘటనలో అరెస్ట్ అయినా సంజయ్ రాయ్ పోలీసులకు అనుబంధ వాలంటీర్ గా పనిచేస్తున్నట్లు తేలింది. దక్షిణ కోల్ కతాలోని శంభునాథ్ పండిట్ వీధిలో ఉండే సంజయ్.. స్థానిక పోలీసు విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వాలంటీర్ గా చేరాడు. అతనికి ఆర్జీ కార్ వైద్య కళాశాల, ఆసుపత్రి చెక్ పోస్ట్ బాధ్యతలు అప్పగించారు. దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా తనను ఉరితీయాలనుకుంటే తీసుకోవాలంటూ ఎదురు చెప్పడం గమనార్హం. సంజయ్ రాయ్ కు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై త్వరగా విచారణ పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే జోరుగానే పోలీసులు విచారణ ప్రక్రియను సాగిస్తున్నారు.