ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు (పేటీఎం) రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 44,303 ప్రభుత్వ పాఠశాలలో ఒకే రోజున మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్స్ ను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు కలిపి దాదాపు 1.2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు (పేటీఎం) రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 44,303 ప్రభుత్వ పాఠశాలలో ఒకే రోజున మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్స్ ను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు కలిపి దాదాపు 1.2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తోంది. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించే పిటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు మిగిలిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సర్పంచులు కార్పొరేటర్లు వార్డు సభ్యులు వారి పరిధిలోని పాఠశాలలో పాల్గొనాలని పాఠశాల విద్యాశాఖ ఆహ్వానాలు పంపించింది శనివారం ఉదయం 10.20 గంటలకు బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని హెరిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ నుంచి మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేటీఎంలో పాల్గొంటారు. 1.40 గంటలకు ఉండవల్లికి ప్రయాణమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును ప్రత్యేక ఉద్దేశంతో నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా అనేక చోట్ల మహిళలకు ముగ్గులు పోటీలు పురుషులకు పోటీలో నిర్వహించనున్నారు అనంతరం తల్లిదండ్రులతో సంబంధిత టీచర్ తరగతి గదిలో సమావేశమై ఎప్పటి వరకు నిర్వహించిన ఎఫ్ఎ -1, 2 పరీక్షల మార్కులు వివరాలతో కూడిన ప్రోగ్రెస్ కార్డులు అందిస్తారు విద్యార్థులకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షల వివరాలను కార్డులో పొందుపరుస్తున్నారు విద్యార్థులు చదువు క్రమశిక్షణ ఇతర అంశాలను తల్లిదండ్రులకు తెలియజేసి వారికి సూచనలు చేయడంతో పాటు సలహాలు స్వీకరిస్తారు అనంతరం అన్ని తరగతుల విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి బోధనకు సంబంధించి సూచనలు తీసుకుంటారు ఆ తరువాత విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు చేస్తారు.
మత్తు పదార్థాలపై అవగాహన..
ఇదే సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఈగల్ కార్యక్రమంపై అవగాహన కలిగించుకునేందుకు వినియోగించుకోనున్నారు. మత్తు మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించిన ఈగల్ పాఠశాల విద్యార్థుల్లో చైతన్యమే లక్ష్యంగా డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహిస్తున్న మెగా పేరేంట్, టీచర్ మీటింగ్ లో గంజాయి, డ్రగ్స్, వైట్నర్ తదితర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలంటూ చైతన్యం తీసుకురానున్నారు. మత్తుకు బానిసైతే అన్నీ కోల్పోతారని, అమ్మానాన్నలపై చిరాకుపడతారని, స్నేహితులు దూరమవుతారని, బంధువులు ఇళ్ళకు రానివ్వరని, చదవలేరని, రాయలేరనే విషయాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయునన్నారు. అన్ని విధాలుగా విద్యార్థులు చితికి పోతారు. ప్రభుత్వం పుస్తకాలు, బ్యాగులు, బూట్లు ఇస్తోంది. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పెడుతోంది. చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి, మత్తుకు సంబంధించిన ఎవరైనా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళకో, టీచర్లకు చెప్పండి. డ్రగ్స్ వద్దు బ్రో అని బడిలో వీధిలో, ఊర్లో గట్టిగా అరవండి అని విద్యార్థులకు వివరించడంతోపాటు దీనికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తారు. మంత్రి లోకేష్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈగల్ అధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు.