మలేరియా బారిన పడకుండా.. దోమకాటుకు దోమ కాటుతోనే చెక్

దోమకాటుకు గురైతే మలేరియా వ్యాధి వస్తుంది. మరి అదే మలేరియా వ్యాధి బారిన పడకుండా దోమకాటు ద్వారా టీకాను ఇవ్వగలిగితే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పరిశోధన జోరుగా సాగుతోంది. మలేరియాకు చెక్ పెట్టే టీకాను దోమకాటు ద్వారా ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ కు చెందిన శాస్త్రజ్ఞులు తీవ్రస్థాయిలో పరిశోధనలు సాగిస్తున్నారు.

Malaria mosquito

మలేరియా దోమ

దోమకాటుకు గురైతే మలేరియా వ్యాధి వస్తుంది. మరి అదే మలేరియా వ్యాధి బారిన పడకుండా దోమకాటు ద్వారా టీకాను ఇవ్వగలిగితే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పరిశోధన జోరుగా సాగుతోంది. మలేరియాకు చెక్ పెట్టే టీకాను దోమకాటు ద్వారా ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ కు చెందిన శాస్త్రజ్ఞులు తీవ్రస్థాయిలో పరిశోధనలు సాగిస్తున్నారు. అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం ఫాల్సీఫారం అనే మలేరియా కారక పరాన్న భక్కులు మన శరీరంలోకి ప్రవేశించి నేరుగా కాలేయంలోకి ప్రవేశిస్తాయి. ఎర్రని రక్త కణాల్లో ఇన్ఫెక్షన్ ను కలుగజేస్తాయి. దానివల్ల బాగా జ్వరం వస్తుంది. దీన్నే మలేరియా అంటారు. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల మందికిపైగా ఈ రకం మలేరియా బారిన పడుతున్నారు. ఎలాగో ఆ జీవులు దోమ కాటు ద్వారానే మనుషుల్లోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఆ పరాన్న జీవుల జన్యువుల్లో మార్పులు చేసి వాటిని బలహీనపరిచి అదే దోమకోట్ల ద్వారా వాటిని వ్యాపింపజేస్తే మనుషుల్లో మలేరియాకు రోగ నిరోధకత పెరుగుతుందని లండన్ శాస్త్రవేత్తలు భావించారు. తమ ఆలోచనను ఆచరణలో పెట్టి ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మలేరియా టీకా అభివృద్ధి దిశగా ఈ ట్రయల్స్ పెద్ద ముందడుగుగా లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాఫికల్ మెడిసిన్ ఇమ్యూనాలజీస్ట్ హఫల్ల తెలిపారు. ఈ అధ్యయనం ఫలితం ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ తాజా సంచికలో ప్రచురితమైంది.

ప్రస్తుతానికి రెండు మలేరియా టీకాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ప్రభావం 75 శాతం మాత్రమే. ఆ టీకాలు కూడా ఒక డోసు వేయించుకుంటే చాలదు. బూస్టర్ డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త టీకాలు అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా లండన్ శాస్త్రజ్ఞులు మలేరియా పరాన జీవుల్లో రెండు రకాల జన్యు మార్పులు చేశారు. మొదటి రకం జీఏ1 కాగా, రెండో రకం జిఏ2. వీటిలో మొదటి రకం పరాన్న జీవులు మనిషి కాలేయంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 24 గంటలు దాకా తమ సంఖ్యను పెంచుకోలేవు. రెండో రకం జీఏ2 జీవులు కాలేయంలోకి ప్రవేశించిన ఆరు రోజుల దాకా అలాగే అచేతనంగా ఉండిపోతాయి తప్ప తమ సంఖ్యను పెంచుకోలేవు. ఆరు రోజులంటే వాటిపై దాడి చేసి చంపేయడానికి మన రోగనిరోధక వ్యవస్థకు ఎక్కువ సమయం దొరికినట్టే. ట్రయల్స్ లో భాగంగా 10 మందికి జిఏ1 రకం పరాన్న జీవి ఉన్న దోమతో కుట్టించారు. మరో 10 మందికి జిఏ2 రకం పరాన్న జీవి ఉన్న దోమతో కుట్టించారు. మూడు వారాల తర్వాత వారికి పరీక్షలు చేయగా రెండు బృందాల వారిలోనూ మలేరియా యాంటీ బాడీలు ఉన్నట్లు వెల్లడయింది. ఆ తరువాత వారికి నిజమైన మలేరియా కారక జీవులను మోస్తున్న అనాఫిలిస్ దోమలతో కుట్టించారు. మొదటి బృందంలోని తొమ్మిది మంది మలేరియా బారిన పడగా, రెండో బృందంలో ఒక్కరు మలేరియా బారిన పడ్డారు. దీంతో ఈ నూతన పరిశోధన మలేరియా వ్యాధి బారిన పడకుండా కీలకంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన పూర్తి చేసి వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకువస్తే మేలు కలుగుతుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్