ఎముకలు దృఢత్వం గా ఉండాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.!

జాయింట్స్ రక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ కూడా శరీరానికి అందాల్సిన పోషకాలు తగ్గిపోయి జాయింట్స్ అరిగిపోతుంటాయి. మోకాలు వంటి ముఖ్యమైన జాయింట్స్ లో గుజ్జు తగ్గిపోతుంది. దీని ఫలితంగా మోకాళ్ళలో నొప్పులు, కీళ్లు అరిగిపోవడం, మోకాలు చిప్పల్లో లోపాలు తలెత్తడం వంటి ఇబ్బందులు ప్రారంభం అవుతుంటాయి. మోకాళ్ళలో మూడు భాగాలు ఉంటాయి.

Bone strength

ఎముకల్లో దృఢత్వం 

మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎముకుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. కాలుజారి కిందపడిన ఎముకలు విరిగిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఎముకల్లో దృఢత్వం లోపించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎముకలకు బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను పెద్దలు తీసుకునేవారు. దీంతో వారికి 60 నుంచి 70 ఏళ్లు వచ్చేంతవరకు ఎముకలు సంబంధిత సమస్యలు పెద్దగా కనిపించే కావు. కానీ ప్రస్తుతం 30 ఏళ్లకే ఎముకల సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరిగింది. అయితే ఇటువంటి సమస్యలకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చెక్ చెప్పవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జాయింట్స్ రక్షణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ కూడా శరీరానికి అందాల్సిన పోషకాలు తగ్గిపోయి జాయింట్స్ అరిగిపోతుంటాయి. మోకాలు వంటి ముఖ్యమైన జాయింట్స్ లో గుజ్జు తగ్గిపోతుంది. దీని ఫలితంగా మోకాళ్ళలో నొప్పులు, కీళ్లు అరిగిపోవడం, మోకాలు చిప్పల్లో లోపాలు తలెత్తడం వంటి ఇబ్బందులు ప్రారంభం అవుతుంటాయి. మోకాళ్ళలో మూడు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫైబ్రస్, రెండోది కార్టిలోజనియస్, మూడోది సైనోవియల్. మోకాళ్ళ నొప్పులకు ఈ ఎముకలు అరుగుదల ప్రధాన కారణంగా చెబుతారు. ఇందులో సైనోవియల్ జాయింట్స్ లో గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు తగ్గినప్పుడల్లా జాయింట్లు అరగడం ప్రారంభిస్తాయి తద్వారా జాయింట్లు అరిగిపోయి నొప్పులు విపరీతంగా మారతాయి. ఈ సైనోవియల్ జాయింట్స్ లో గుజ్జు అరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సమస్యకు చెక్..

ఈ జాయింట్స్ కు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని ఎముకుల వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శరీర ఎత్తుకు తగినట్టుగా బరువును మెయింటైన్ చేయాలి. లేకపోతే శరీర బరువు అంతా మోకాళ్లపై పడుతుంది. ఫలితంగా జాయింట్ దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్యకు కారణం అవుతుంది. నిత్యం యాక్టివ్ గా ఉండడం వల్ల ఎముకల కదలిక ఉండి మోకాలలో నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటివి రాకుండా ఉంటాయి. సైక్లింగ్ వాకింగ్ వంటి చేయడం ద్వారా జాయింట్ నొప్పులనుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫిజికల్ గా యాక్టివ్ గా శరీరాన్ని ఉంచుకోవాలి. అప్పుడే కండరాలకు రక్తప్రసరణ సరిగా జరిగి నొప్పులు రాకుండా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కు సరిగ్గా కూర్చోకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు నిపుణులు. కూర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి వెన్నుపోసుకో రెస్ట్ ఇస్తూనే కాళ్లకు భారం కాకుండా కుర్చీ ఉండాలి. లేకపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. 

ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం..

ఎముకలకు బలాన్ని ఇచ్చే కొన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారినపడకుండా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. చేపలు ఫ్లాక్స్ సీడ్స్, ఆక్రూట్ పండ్లు ఆహారంలో ఉండాలి. దీంతోపాటు విటమిన్ డి అందేలా ఆకుకూరలు, సోయా ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు ప్రధానమైన మరొక కారణం శరీరంలో డీహైడ్రేషన్ ఉండడం. శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఎక్కువగా మంచినీటిని తీసుకుంటూ ఉండాలి. అదే సమయంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్న ఒత్తిడి కూడా ఎముకుల సంబంధిత మోకాళ్ళ నొప్పులకు కారణం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్