భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంతోమంది అనేక చోట్ల డిపాజిట్ చేస్తుంటారు. నెలవారీ కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా భవిష్యత్తులో భారీగా నగదు పొందేందుకు ఉన్న మార్గాలను పలువురు అన్వేషిస్తుంటారు. అటువంటి వారి కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం లో భాగంగా అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ స్కీం ద్వారా ఎంత వడ్డీ వస్తుంది, ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో నేలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఎనిమిది లక్షల వరకు రిటర్న్ పొందేందుకు అవకాశం ఉంది. 5000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 60 వేల రూపాయలు అవుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంతోమంది అనేక చోట్ల డిపాజిట్ చేస్తుంటారు. నెలవారీ కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా భవిష్యత్తులో భారీగా నగదు పొందేందుకు ఉన్న మార్గాలను పలువురు అన్వేషిస్తుంటారు. అటువంటి వారి కోసం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం లో భాగంగా అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ స్కీం ద్వారా ఎంత వడ్డీ వస్తుంది, ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో నేలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఎనిమిది లక్షల వరకు రిటర్న్ పొందేందుకు అవకాశం ఉంది. 5000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 60 వేల రూపాయలు అవుతుంది. ఈ స్కీం లో 6.7% వడ్డీ లభిస్తుంది. ఇలా 5000 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం మూడు లక్షలు అవుతుంది. దీనికి వడ్డీ కింద రూ.56,830 రూపాయలు వస్తాయి. ఈ స్కీం కింద రూ.5000 రూపాయలు చొప్పున 10 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి ఆరు లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్ పై 6.7% వడ్డీ అంటే మొత్తం రూ.2,54,722 అవుతుంది. దీని ప్రకారం 10 సంవత్సరాలు కాలంలో డిపాజిట్ చేసిన మొత్తం రూ.8,54,272 అవుతుంది. ఇలా 10 ఏళ్లలో 5000 ఇన్వెస్ట్ చేస్తే ఎనిమిది లక్షలు కంటే ఎక్కువ పొందేందుకు అవకాశం ఉంటుంది.
2023లో ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం పై వడ్డీ రేట్లు పెంచింది. వడ్డీ పెరగడం వల్ల పెట్టుబడిదారులకు లభించే రిటర్న్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ చివరి సవరణ 29 సెప్టెంబర్ 2023న జరిగింది. దీని ప్రకారం ఈ స్కీం లో భారీగా వడ్డీ లభిస్తోంది. అలాగే సమీపంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిని వేయి నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. ఈ వ్యవధి పూర్తయ్యేలోపు ఖాతాను మూసివేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఎకౌంటు ఏడాది పాటు యాక్టివ్ గా ఉన్న తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ రేటు రెండు శాతం కంటే ఎక్కువగా లభిస్తుంది.