పురుషులకు ప్రాణాంతకంగా మారుతున్న ఆ కేన్సర్.. నివారణకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కేన్సర్ బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత చెందుతున్నారు. కొన్ని కేన్సర్లు మహిళల్లో మాత్రమే కనిపిస్తుండగా, కొన్ని కేన్సర్లు పురుషుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. పురుషుల్లో మాత్రమే కనిపించే కేన్సర్లలో ఒకటి వారికి ప్రాణాపాయంగా మారుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషుల్లో అత్యంత కామన్ గా కనిపిస్తున్న ఈ కేన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చూపిస్తున్నారు. అదే బ్లాడర్ కేన్సర్. దీన్ని మూత్రాశయ కేన్సర్ గా కూడా చెబుతారు.

Bladder cancer

మూత్రాశయ కేన్సర్

ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. కేన్సర్ బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత చెందుతున్నారు. కొన్ని కేన్సర్లు మహిళల్లో మాత్రమే కనిపిస్తుండగా, కొన్ని కేన్సర్లు పురుషుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. పురుషుల్లో మాత్రమే కనిపించే కేన్సర్లలో ఒకటి వారికి ప్రాణాపాయంగా మారుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషుల్లో అత్యంత కామన్ గా కనిపిస్తున్న ఈ కేన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చూపిస్తున్నారు. అదే బ్లాడర్ కేన్సర్. దీన్ని మూత్రాశయ కేన్సర్ గా కూడా చెబుతారు. ఈ కేన్సర్ కు అనేక అంశాలు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా ధూమపానం చేయడం వలన బ్లాడర్ 

కేన్సర్ వస్తోందని చెబుతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల గొంతు కేన్సర్ తోపాటు మూత్రశయ కేన్సర్ కూడా వస్తుంది. ఇది మూత్ర కేన్సర్ కు కారణం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొగాకులోని రసాయనాలు కాలక్రమేనా మూత్రనాళంపై ఉన్న పొరను దెబ్బతీసి కేన్సర్ గా మారుతున్నట్లు చెబుతున్నారు. అలాగే రబ్బర్లు, తోలు, కలర్ పెయింట్లు తయారీలో వినియోగించే కొన్ని కెమికల్స్ మూత్ర కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఆయా పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఈ కేన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. మూత్ర మార్గం దగ్గర వచ్చే అంటూ వ్యాధులు ఎక్కువ కాలం ఉంటే అది ఈ కేన్సర్ కు దారి తీస్తోంది. కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ తరచూ వస్తుంది. అటు వంటివారు దానిని అశ్రద్ధ చేస్తే అదే కేన్సర్ కు దారి తీయవచ్చు. మూత్రపిండాల్లోని రాళ్లు కూడా ఈ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వయసు పెరిగిన వారిలో ముఖ్యంగా 55 ఏళ్లు పైబడిన వారిలో మూత్ర కేన్సర్ సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఆడవారి కంటే మగవారినే ఎక్కువగా ఇది ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీలో మూత్ర క్యాన్సర్ ఎవరికైనా ఉంటే అది వ్యాధిని అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంది. జెన్యూపరంగా ఇది వారి కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంది. 

కేన్సర్ ను గుర్తించే లక్షణాలు ఇవే..

మూత్రశయ కేన్సర్ వచ్చిన వారిలో మూత్రం రంగులో మార్పు ఉంటుంది. మాత్రం ఎరుపు లేదా కోలా రంగులో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది కనిపించదు. రిపోర్ట్స్ లో మాత్రమే వస్తుంది. మూత్ర విసర్జన తరచుగా చేస్తుంటారు. యూరినేషన్ సమయంలో పెయిన్ తీవ్రంగా ఉంటుంది. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుంది. ఈ లక్షణాలు ఉంటే అనుమానించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మూత్ర కేన్సర్ రాకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవచ్చు. లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసి మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు  స్మోకింగ్ మానేయడం చాలా ముఖ్యం.  కేన్సర్ కారకాల్లో స్మోకింగ్ ప్రధానమైన కారణం. కాబట్టి దీనికి వీలైనంత దూరంగా ఉండాలి. సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ గా కూడా ఉండకూడదు. శరీరానికి నీటిని పుష్కలంగా అందిస్తూ ఉండాలి. పండ్లు, కూరగాయలు రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవడంతోపాటు సమతుల ఆహారం తీసుకోవాలి. దీనివల్ల కెన్సర్లు ప్రమాదం తగ్గుతుంది. అదే సమయంలో రెగ్యులర్ గా మూత్ర పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అలాగే, ఆరోగ్యకరమైన అలవాట్లను ఫాలో అవ్వడం వల్ల ఏ క్యాన్సర్ కు అయినా దూరంగా ఉండవచ్చు. రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేస్తే త్వరగా గుర్తించి ప్రమాద తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్