దేశంలో విమాన ప్రయాణాలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది విమానాల్లో ప్రయాణాలను సాగిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన నగరాల్లో విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో ఆయా నగరాల్లోని విమానాశ్రయాలకు ప్రయాణీకుల తాకిడి అధికంగా ఉంటోంది. దేశంలోని పదుల సంఖ్యలో విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే, కొన్నింటికి మాత్రమే అధిక సంఖ్యలో ప్రయాణీకులు వస్తుంటారు. ఆయా విమానాశ్రయాలు చాలా బిజీగా ఉంటుంటాయి. నిత్యం వందలాది మంది ప్రయాణీకులు రాకపోకలతో అక్కడ బిజీ వాతావరణం నెలకొంటుంది. ఈ మేరకు దేశంలో ప్రయాణీకులతో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్ పోర్టులు జాబితాను ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ తాజాగా విడుదల చేసింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం
దేశంలో విమాన ప్రయాణాలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది విమానాల్లో ప్రయాణాలను సాగిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధాన నగరాల్లో విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో ఆయా నగరాల్లోని విమానాశ్రయాలకు ప్రయాణీకుల తాకిడి అధికంగా ఉంటోంది. దేశంలోని పదుల సంఖ్యలో విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే, కొన్నింటికి మాత్రమే అధిక సంఖ్యలో ప్రయాణీకులు వస్తుంటారు. ఆయా విమానాశ్రయాలు చాలా బిజీగా ఉంటుంటాయి. నిత్యం వందలాది మంది ప్రయాణీకులు రాకపోకలతో అక్కడ బిజీ వాతావరణం నెలకొంటుంది. ఈ మేరకు దేశంలో ప్రయాణీకులతో నిత్యం రద్దీగా ఉండే ఎయిర్ పోర్టులు జాబితాను ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ తాజాగా విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అక్కడి నుంచి ప్రయాణించిన పాసింజర్ల సంఖ్య వారీగా టాప్-10లో నిలిచిన ఎయిర్‌పోర్టులు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో ముందంజలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య 73.67 మిలియన్లు. గడిచిన ఏడాది కోట్లాది మంది ఇక్కడి నుంచి ప్రయాణాలను సాగించారు. రెండో స్థానంలో ముంబయిలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ విమానాశ్రయం నుంచి 52.82 మిలియన్లు ప్రయాణాలు సాగించారు.
మూడో స్థానంలో బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి గడిచిన ఏడాది 37.53 మిలియన్లు మంది ప్రయాణీకులు ప్రయాణించారు. నాలుగో స్థానంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి 25.04 మిలియన్లు మంది ప్రయాణాలు సాగించారు. ఆ తరువాత తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం 21.21 మిలియన్ల ప్రయాణీకులతో ఐదో స్థానంలో నిలిచింది. ఆరో స్థానంలో 19.78 మంది మిలియన్ల ప్రయాణీకులతో కోల్‌తాలోని నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఏడో స్థానంలో అహ్మదాబాద్‌లోని సర్ధార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.70 మిలియన్లు మంది ప్రయాణాలు సాగించారు. ఎనిమిదో స్థానంలో కొచ్చిన్‌లోని కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి 10.37 మిలియన్లు మంది ప్రయాణీకులు ప్రయాణాలు సాగించారు. తొమ్మిదో స్థానంలో మహరాష్ట్రలోని పుణె విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి 9.53 మిలియన్లు మంది ప్రయాణీకులు ప్రయాణాలను సాగించారు. పదో స్థానంలో గోవాలోని డైబోలిమ్ విమానాశ్రయం నిలిచింది. ఇక్కడి నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6.87 మిలియన్లు మంది ప్రయాణాలను సాగించారు.