ఎనిమిది వేలలోపు బ్రాండెడ్‌ ఫోన్లు ఇవే.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే

స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న కొద్ది విభిన్నమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌ వాడాలనిపిస్తుంది. అయితే, అదే సమయంలో బడ్జెట్‌ ఫోన్‌ ఉండాలని భావిస్తుంటారు. అయితే, ఇటువంటి వారి కోసం ఎనిమిది వేల ధరలో భిన్నమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రేజీ ఫీచర్లతో ఉన్న ఈ బడ్జెట్‌ ఫోన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రూ.8 వేలలోపు ధరతో బ్రాండెడ్‌ స్మార్ట్‌ ఫోన్లు లభిస్తుండడం, అందులోనూ మంచి ఫీచర్లు ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ బడ్జెట్‌ ఫోన్‌ జాబితాలో శామ్సంగ్‌, మోటోరోలా, రియల్‌ మీ కంపెనీకి చెందిన ఫోన్లు ఉన్నాయి.

Realme Narzo N61

రియల్‌ మీ నార్జో N61

స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న కొద్ది విభిన్నమైన ఫీచర్లతో కూడిన ఫోన్‌ వాడాలనిపిస్తుంది. అయితే, అదే సమయంలో బడ్జెట్‌ ఫోన్‌ ఉండాలని భావిస్తుంటారు. అయితే, ఇటువంటి వారి కోసం ఎనిమిది వేల ధరలో భిన్నమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రేజీ ఫీచర్లతో ఉన్న ఈ బడ్జెట్‌ ఫోన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రూ.8 వేలలోపు ధరతో బ్రాండెడ్‌ స్మార్ట్‌ ఫోన్లు లభిస్తుండడం, అందులోనూ మంచి ఫీచర్లు ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ బడ్జెట్‌ ఫోన్‌ జాబితాలో శామ్సంగ్‌, మోటోరోలా, రియల్‌ మీ కంపెనీకి చెందిన ఫోన్లు ఉన్నాయి. అద్భుతమైన డిస్‌ ప్లే, అత్యుత్తమ ఇన్‌ క్లాస్‌ ప్రాసెసర్‌, 50 మెగా ఫిక్సెల్స్‌ వరకు ప్రధాన కెమెరాను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లు 5200 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఆయా ఫోన్లకు సంబంధించిన ఫీచర్లను పరిశీలిస్తే.. రియల్‌ మీ నార్జో N61. ఇది 4 GB RAM, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్‌ ధర అమెజాన్‌ ఇండియాలో రూ.7,499గా ఉంది. ఈ ఫోన్‌ 6 GB వరకు RAM, 128 GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో ప్రాసెసర్‌గా UNISOC T612ను అందిస్తోంది. ఈ ఫోన్‌లో 32 మెగా ఫిక్సెల్‌ ప్రధాన కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 5 మెగా ఫిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ బ్యాటరీ 5000 mAh, ఇది 10 W చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

అలాగే, మోటరోలా నుంచి GO5 ఫోన్‌ వచ్చింది. ఇది 4GB RAM, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్‌ ధర ప్లిప్‌కార్ట్‌లో రూ.7,299గా ఉంది. ఈ మోటరోలా ఫోన్‌లో 6.67 అంగుళాల పంచ్‌ హోల్‌ డిస్‌ ప్లే ఉంటుంది. ఈ డిస్‌ ప్లే 1000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనిలో హీలియో G81 చిప్‌ సెట్‌ను ప్రాసెసర్‌గా అందిస్తోంది. ఫొటోగ్రఫీ కోసం, ఫోన్‌ వెనుక భాగంలో ఎల్‌ఈడీ ప్లాష్‌తో కూడిన 50 మెగా ఫిక్సల్‌ ప్రధాన కెమెరా అందించారు. సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఈ మోటరోలా ఫోన్‌ బ్యాటరీ 5200 mAh ఉంది. 

శామ్సంగ్‌ గెలాక్సీ MO5 నుంచి మరో ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 4GB RAM, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్‌ ధర ప్లిప్‌కార్ట్‌లో రూ.6,980గా ఉంది. శామ్సంగ్‌ నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవెల్‌ ఫోన్‌ అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనిలో 6.7 అంగుళాల డిస్‌ ప్లే ఉంది. ఈ ఫోన్‌లో ఫొటోగ్రఫీ కోసం ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50 మెగా ఫిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్