కొందరు వ్యక్తులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లు మాట్లాడినప్పుడు కొన్ని సందర్బాల్లో బాగానే అనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో విసుగు పుడుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
కొందరు వ్యక్తులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లు మాట్లాడినప్పుడు కొన్ని సందర్బాల్లో బాగానే అనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో విసుగు పుడుతుంది. అలాంటివారు కనిపిస్తే వాగుడుకాయ వచ్చాడురా అని కామెంట్స్ చేస్తూ, చులకగా చూస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని సూచనలు. అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాట్లాడాలి, అప్పుడే మన వ్యక్తిత్వం అవతలి వారికి అర్థమవుతుంది. అలాగే కొన్నిచోట్ల మాట్లాడకూడదు, మాట్లాడితే అవమానం జరుగుతుంది.
1. భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు, దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది. మీకు తెలుసా? భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను, తల్లిదండ్రులకు కచ్చితంగా చెబుతుంది. భార్య ముందు ఎక్కువగా వాగితే, నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది. ఆ విషయం తన తల్లిదండ్రుల వద్ద చెప్పి, భర్త పరువును తీస్తుంది. దీని వల్ల అత్తమామల ముందు అల్లుడు లోకువైపోతాడు.
2. మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే, మీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం. ఎక్కడైతే మీ భావాలను అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండటం మంచిది, ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే మనం ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తాం. మన మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అర్థం. కాబట్టి అలాంటి చోట మౌనంగా ఉండాలి.
3. కూతురిని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చిన చోట మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు. ఆడపిల్ల పుట్టింటిలో ఉంటే, పుట్టింటి వారికి గౌరవం ఉండదు.
4. నీ కన్నా పై స్థాయిలో ఉన్న వారితో గట్టిగా మాట్లకూడదు. నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు, వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు.
5. వేశ్యల వద్ద, స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు. మీకు తెలుసా? ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను, తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల భవిష్యత్తులో అతడికి అనేకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
6. ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ సైలెంట్‌ను భరించలేక మీకు క్షమాపణలు చెప్తారు. గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉన్నచోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధిలేనివారు అని అనుకుంటారు.