గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు సర్వత్ర విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పెడుతున్న కేసులు చూస్తుంటే రెడ్ బుక్ అమలు చేయడమే ప్రధానంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.
నోటీసులు అందుకున్న రామ్ గోపాల్ వర్మ
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు సర్వత్ర విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పెడుతున్న కేసులు చూస్తుంటే రెడ్ బుక్ అమలు చేయడమే ప్రధానంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఆయన అనేక చోట్ల రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన నాయకులు, అధికారులకు తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవంటూ అప్పట్లోనే హెచ్చరించారు. అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేశామని వెల్లడించారు. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్నట్టుగానే నారా లోకేష్ ప్రస్తుతం రెడ్ బుక్ లో రాసుకున్న నాయకులు, అధికారుల చిట్టా తెరుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమందిని అరెస్టు చేయించారు. ఈ జాబితాలో అరెస్టు కావాల్సిన నాయకులు కూడా ఇంకా ఉన్నారు. వీరి విషయంలో టిడిపి నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరినైతే లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారో వారిపై కేసులను పెట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు పెట్టించిన తర్వాత సదరు నాయకులను అరెస్టు చేయించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు అయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇంటూరి రవి కిరణ్, వర్రా రవీందర్ వ్యవహారంలో ఇదే ఫార్ములాను కూటమి నాయకులు ఫాలో అయ్యారు.
తాజాగా అనేక చోట్ల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను ఆధారంగా చేసుకుని అరెస్టు చేయడంతోపాటు.. ఇదివరకు ఉన్న కేసులకు సంబంధించిన చిట్టాను బయటికి తీసే ప్రయత్నాన్ని కూటమి నాయకులు చేస్తున్నారు. తరువాత లిస్టులో ఈ ముగ్గురు ఉన్నారని, అందుకే వీరిపై రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న నాయకులపై ముందుకు వెళ్లడానికి వ్యూహాత్మకంగా కేసులను పెట్టిస్తున్నట్లు చెబుతున్నారు. తరువాతి దశలోనూ మరి కొంతమంది నాయకుల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. మిగిలిన నేతలపైన కేసులను నమోదు చేయడం ద్వారా వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఎవరైతే ప్రజల్లోకి వచ్చి బలంగా వాయిస్ వినిపిస్తారో.. అటువంటి వారిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వైసిపి ప్రజల్లోకి రాకుండా చేసే ప్రయత్నం సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసులు నమోదు, పెద్ద ఎత్తున అరెస్టులు అంటూ జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి రానున్న రోజుల్లో రెడ్ బుక్కులోని పేర్లు ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాల్సి ఉంది.