తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి
అలర్ట్: తెలంగాణలో మారో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.
ఈ నెలలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశముందని వాతావరణ అధికారులు ప్రకటించారు. ఇది వర్షపాతంతో పాటు ఇతర వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపవచ్చని తెలిపారు. నిన్న రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యింది, ఇందులో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలియజేసింది.
రేపు(శనివారం) భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి వంటి జిల్లాల్లో వర్షాలు పడుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు.
ఆదివారం వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.