సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖంగా వినిపించే పేరు నల్ల మిరియాలు. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేసే ఈ నల్ల మిరియాల గురించి చాలా మందికి తెలియదు. నల్ల మిరియాలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. నల్ల మిరియాలు ఆహారానికి రుచిని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి. అందుకే వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు.
నల్ల మిరియాలు
సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖంగా వినిపించే పేరు నల్ల మిరియాలు. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేసే ఈ నల్ల మిరియాల గురించి చాలా మందికి తెలియదు. నల్ల మిరియాలు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. నల్ల మిరియాలు ఆహారానికి రుచిని అందించడంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి. అందుకే వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. తరచూ నల్ల మిరియాలు వాడటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఉబ్బసం, జీర్ణశక్తి లేకపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది కాలేయం పనితీరును వేగవంతం చేయడంతోపాటు ఆకలని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటుంది. నల్లమిరియాల్లో యాంటీ మైక్రో బయల్, యాంటీ ఎలర్జీక్, యాంటీ బ్యాక్టీరియల్, డైజెస్టివ్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గుతాయి. దీనివల్ల షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. షుగర్ తో బాధపడే వారికి మిరియాలు బెస్ట్ ఎంపిక. ఇవి జీర్ణ వ్యవస్థను రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ఫ్లావనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. నల్ల మిరియాల్లోని పోషకాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. నల్ల మిరియాలతో కూడిన పాలు తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దీంతోపాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలు నయమవుతాయి. నల్లమిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందువు. నల్ల మిరియాలు తింటే రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలు వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు నల్ల మిరియాలు తీసుకుంటే మంచిది. మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపు, దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. మిరియాలు తింటే ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. నల్ల మిరియాలను నేరుగా తీసుకోవచ్చు. పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు.