రూ.37 లక్షల వార్షిక వేతనంతో కేంద్రంలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే.!

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) పలు పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఎందుకోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయనుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేలా ప్రక్రియ ప్రారంభించింది. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 48 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

job notification

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) పలు పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. లక్షలాది రూపాయల వార్షిక వేతనంతో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC) పలు పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఎందుకోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయనుంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేలా ప్రక్రియ ప్రారంభించింది. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 48 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హెడ్ ఎస్ఎంటీ ఏడు, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు 16, కన్సల్టెంట్ పోస్టులు 25 ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించి ఆశావహ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను డిజిటల్ కార్పొరేషన్ ఇండియా స్వీకరిస్తోంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ ఆరో తేదీలోగా www.dic.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆయా పోస్టులను నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ (NEGD) కింద ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భర్తీ చేయడం ఉంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అర్హత ప్రమాణాలు ఉండాలని పేర్కొంది.

హెడ్ SEMT పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ/బిటెక్/బిసిఎ/బీఎస్సీ(ఐటి)/బీఎస్సీ (సిఎస్) డిగ్రీతోపాటు ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎంబీఏ/ఎంఎస్సీ(ఐటి)/ ఎంఎస్సి (సిఎస్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించిన టాపిక్ పై పీహెచ్డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. విద్యార్హతతోపాటు 15 ఏళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగానికి సంబంధిత విభాగంలో బిఈ/బిటెక్/బిసిఎ/బిఎస్సి/ఐటి/బిఎస్సీ(సిఎస్) డిగ్రీతోపాటు ఎంటెక్/ఎంఎస్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతోపాటు కనీసం 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయోపరిమితికి సంబంధించి వివరాలను పరిశీలిస్తే.. హెడ్ SEMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 55 ఏళ్లకు మించకూడదు. పోస్టును బట్టి వేతనాల్లో మార్పులు ఉంటాయి. హెడ్ SEMT పోస్ట్ కు ఎంపికయ్యే అభ్యర్థికి ఏడాదికి 37 లక్షల వరకు జీతం లభించనుంది. సీనియర్ కన్సల్టెంట్లకు సంవత్సరానికి రూ.30 లక్షలు, కన్సల్టెంట్లకు ఏడాదికి రూ.20 లక్షలు వరకు వేతనం లభించనుంది. ఎంపికైన తర్వాత ఆయా అభ్యర్థులు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ను అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది. వివిధ కేంద్ర ఏజెన్సీలు, కమిటీలు జారీ చేసే పాలసీ విధానాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు, ప్రాజెక్టు మేనేజ్మెంట్, ప్రొక్యూర్ మెంట్ ప్రాసెస్ చేపట్టాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మెరుగైన వేతనాలతో కూడిన ఉద్యోగాలను చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్