ఉక్రెయిన్, రష్యా మధ్య గడిచిన వేయి రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం యుద్ధానికి దారితీసింది. ఇరుదేశాలు గడిచిన మూడున్నరేళ్ళుగా యుద్ధ క్షేత్రంలో తలపడుతూనే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే కావడం గమనార్హం. కొన్ని నెలలపాటు జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ఇరుదేశాలు తీవ్రంగానే నష్టపోయాయి.
యుద్ధం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న ప్రజలు
ఉక్రెయిన్, రష్యా మధ్య గడిచిన వేయి రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం యుద్ధానికి దారితీసింది. ఇరుదేశాలు గడిచిన మూడున్నరేళ్ళుగా యుద్ధ క్షేత్రంలో తలపడుతూనే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే కావడం గమనార్హం. కొన్ని నెలలపాటు జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ఇరుదేశాలు తీవ్రంగానే నష్టపోయాయి. ఆర్థికంగానే కాకుండా ప్రాణ నష్టము ఇరుదేశాలకు భారీగానే సంభవించింది. రష్యా తో పోలిస్తే ఉక్రెయిన్ అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆర్థికంగానే కాకుండా జనాభా పరంగాను అనేక సమస్యలను ఈ దేశం ఎదుర్కొంటోంది. వెయ్యి రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఆ దేశంలో సుమారు కోటి మంది జనాభా తగ్గుముఖం పెట్టారు. మరణాలు, యుద్ధ భయంతో ఇతర దేశాలకు వలసలు, జననాల సంఖ్య తగ్గుముఖం పట్టడం వంటి అనేక కారణాలు ఉక్రెయిన్ దేశ జనాభా భారీగా తగ్గిపోవడానికి కారణమైనట్లు చెబుతున్నారు.
గడిచిన నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరువైపులా 10 లక్షల మంది చనిపోవడమో, తీవ్రంగా గాయపడటం జరిగింది. 21వ శతాబ్దంలో ఇప్పటి వరకు చవి చూసిన అత్యంత తీవ్రమైన యుద్ధం కూడా ఇదే అని చెబుతున్నారు. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు నేలమట్టమై శిథిలాలుగా మారాయి. ఉక్రెయిన్ సైన్యంలో 80 వేల మందికిపైగా చనిపోయారు. నాలుగు లక్షల మందికిపైగా గాయపడి కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. రష్యా వైపు సైన్యంలో మరణాలు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా. క్షతగాత్రులు నాలుగు లక్షల వరకు ఉంటారని చెబుతున్నారు. నిజానికి రెండు దేశాల్లో యుద్ధం లేని సమయంలోనే జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.
ఉక్రెయిన్ లో సాధారణ ప్రజలు 12 వేల మంది చనిపోయారు. మరో 25 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ లో పిల్లలు కనేవారు మరింత తగ్గిపోయారు. రెండున్నరేళ్ళ క్రితం ఉన్న జననాల రేటు మూడో వంతు పడిపోయింది. యుద్దాల వల్ల కాకుండా సహజ మరణాలు, వలసలు, జననాల రేటు తగ్గిపోవడం కారణంగా ఉక్రేయన్ లో గడిచిన రెండున్నరేళ్ళలో కోటి మంది జనాభా తగ్గిపోయారు. యుద్ధానికి ముందు ఈ దేశంలో నాలుగు కోట్ల మంది జనాభా ఉండగా, యుద్ధం తర్వాత ప్రస్తుతం ఆ దేశ జనాభా మూడు కోట్లకు తగ్గింది. ఏకంగా గడిచిన వెయ్యి రోజుల్లో 67 లక్షల మంది వలస వెళ్లిపోయారు. యుద్ధంతో ఉక్రేయన్ ఆర్థిక వ్యవస్థ మూడోవంతు కుదేలైపోయింది. ఆస్తి నష్టం 13 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల నుంచి ఇప్పట్లో కోలుకోవడం కూడా కష్టంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పట్లో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపించడం లేదు. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అమెరికా అందించిన దీర్ఘ శ్రేణి, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల తరువాత మరింత తీవ్రంగా రష్యా స్పందించే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతుంది. రష్యా పైకి గగనతల దాడులు చేస్తే తమ అన్వాయుధ విధానం మారుతుందని గతంలోనే పుతిన్ ప్రకటించారు. తాజా దాడులు నేపథ్యంలో రష్యా అందుకు అనుగుణంగానే తీవ్రస్థాయిలో స్పందించే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ యుద్ద ముప్పు పొంచి ఉంటుంది అన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.