పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను దుండగులు కాల్చి చంపారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని దుండగులు కాల్చడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీఎం ఇప్పటికే దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
హత్యకు గురైన ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగి
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను దుండగులు కాల్చి చంపారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని దుండగులు కాల్చడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీఎం ఇప్పటికే దృష్టి సారించినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగిపై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి పాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుర్ ప్రీత్ ను కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయితే గాయపడిన గుర్ ప్రీత్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. గుర్ ప్రీత్ గోగి పంజాబ్ లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఘటనపై హాఫ్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం కార్యాలయం వెల్లడించింది. వెంటనే దీనిపై ఉన్నత స్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. బాధ్యులపై కఠినంగా వ్యవహరించడంతోపాటు వెనుక ఎవరు ఉన్నదానిని నిర్ధారిస్తామని ఆ పార్టీ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ అడిగి తెలుసుకున్నారు. ఆయన పంజాబీ వెళ్లి పరామర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటన వెనుక కారణాలు ఏమి ఉండి ఉంటాయి అన్నదానిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలతో హత్యకు పాల్పడ్డారా.? మరి ఏదైనా విషయం ఉందా అన్నదానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.