చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏమిచ్చిందంటే.?

చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు చూడడం, డౌన్లోడ్ చేయడం ఫోక్సో చట్టం ప్రకారం నేరమంటూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు చూడడం, డౌన్లోడ్ చేయడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అదే సమయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన కీలక వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది.

Supreme Court

సుప్రీంకోర్టు 

చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు చూడడం, డౌన్లోడ్ చేయడం ఫోక్సో చట్టం ప్రకారం నేరమంటూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పును ఇచ్చింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలు చూడడం, డౌన్లోడ్ చేయడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. అదే సమయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన కీలక వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది. చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించి ఇచ్చిన తీర్పులో మద్రాస్ హైకోర్టు తప్పిదం చేసిందంటూ పేర్కొంది. పిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకువచ్చిన ఈ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలను చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తన మొబైల్ లో చైల్డ్ ఫోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసిన 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేశారు. అతడిపై ఉన్న అభియోగాలను మద్రాస్ హైకోర్టు కొట్టి వేయడంతోపాటు క్రిమినల్ ప్రొసీడింగ్ లను కూడా రద్దు చేసింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేటి పిల్లలు అశ్లీల వీడియోలు చూడడం అనే తీవ్రమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, వారిని శిక్షించే బదులు విద్యాబుద్ధులు నేర్పించేలా సమాజం పరిణితి చెందాలని తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు పట్ల అప్పట్లోనే విభిన్న వర్గాల నుంచి నిరసన వ్యక్తం అయింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించే రీతిలో ఈ తీర్పు ఉందంటూ పలువురు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ తీర్పుకు వ్యతిరేకంగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. నిందిత యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తిరిగి కొనసాగించాలని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల వలన మరింతగా చైల్డ్ ఫోర్నోగ్రఫీ పెరిగే అవకాశం ఉందన్న భావనను సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. చిన్న పిల్లల అశ్లీలతతో ముడిపడిన మెటీరియల్ ను స్టోర్ చేసుకుంటే ఫోక్సో చట్టంలోని సెక్షన్ 15 వర్తిస్తుందని, శిక్ష పడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిల్లలకు సంబంధించిన ఏదైనా అశ్లీల మెటీరియల్ ను స్టోర్ చేసిన వ్యక్తి దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయకపోయినా, దానిని తొలగించకుండా ఉంటే కనీసం రూ.5 వేలు జరిమానా ఉంటుందని, మరోసారి పునరావృతమైతే రూ.10 వేలు తక్కువ కాకుండా జరిమానాతోపాటు ఫోక్సో కేసు పడుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ సదరు మెటీరియల్  మరింత వ్యాపింప చేస్తే జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని వెల్లడించింది. ఏదైనా వాణిజ్య ఉద్దేశంతో పిల్లల అశ్లీల వీడియోలను స్టోర్ చేసినట్లయితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా చేసిన నేరం కంటే నేరం వెనుక ఉన్న ఉద్దేశం అసలు నేర పూరిత చర్య అవుతుందని జస్టిస్ పార్దివాల స్పష్టం చేశారు. ఈ తీర్పును జస్టిస్ పార్దివాల రాశారు. తనకు ఈ అవకాశం కల్పించిన సిజెఐ డివై చంద్ర చూడ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పిల్లలపై చైల్డ్ ఫోర్నోగ్రఫీ ప్రభావం చూపుతోందని, దీనిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేశామని పేర్కొన్నారు.  ఫోక్సో చట్టానికి సవరణ తీసుకురావాలని పార్లమెంటుకు సూచించినట్లు ఈ సందర్భంగా ధర్మసనం పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా కఠిన చర్యలను తీసుకోవడం ద్వారా చైల్డ్ ఫోర్నోగ్రఫీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్