ఎండ వేడి మనుషులకే కాదు ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా.. చల్లబరిచేయండి ఇలా.!

గడిచిన కొద్ది రోజుల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉన్న ఎండ వేడిమికి విలవిల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భానుడి ప్రతాపం చూపిస్తాడని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల నుంచి ఎండలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల వల్ల ప్రజలకే కాదు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రోజువారి వినియోగించే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్టాప్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించినప్పుడు ఈ ఎండ వేడికి తీవ్రంగా వేడెక్కుతాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గడిచిన కొద్ది రోజుల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉన్న ఎండ వేడిమికి విలవిల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భానుడి ప్రతాపం చూపిస్తాడని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల నుంచి ఎండలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల వల్ల ప్రజలకే కాదు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రోజువారి వినియోగించే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్టాప్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించినప్పుడు ఈ ఎండ వేడికి తీవ్రంగా వేడెక్కుతాయి. ఇటువంటి సమయంలో నిరంతరం వీటిని ఉపయోగించినప్పుడు వాటి పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికే చాలామంది వీటిని వినియోగిస్తుంటారు. అటువంటి వారికి ఈ సమస్య ఇప్పటికే ఎదురై ఉంటుంది. ఫోన్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ వేడెక్కుతుండడం జరుగుతుంటే మాత్రం కొన్ని చిట్కాలను పాటించి మీ ఎలక్ట్రానిక్ వస్తువులను చల్లగా ఉండేలా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా సరే ముందుగా ఉపయోగించి దానిని వెంటనే వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. అదే సమయంలో వాటిని గోడకు అతికించడం చేయురాదు. ఈ పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండటం వల్ల మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా అవి వేడిని బయటకు తీసుకురాలేవు. ఒకవేళ లాప్టాప్ లేదా కంప్యూటర్లో పనిచేస్తున్నప్పుడల్లా దానిపై ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మరింత హీట్ కాకుండా చేయవచ్చు. ఒకవేళ సూర్యకాంతి పడే ప్రదేశాల్లో ఈ పరికరాలను ఉంచినట్లయితే అవి మరింత వేడెక్కే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వేడి నుంచి రక్షించుకునేందుకు వాటికి తగిన గాలి తగిలే విధంగా చూడడం అత్యుత్తమ పరిష్కార మార్గంగా చేరుకుంటున్నారు. 

అలాగే వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటిపై ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అవి మరింతగా హీట్ ఎక్కే ప్రమాదం ఉంది. ఇది పరికరాలు త్వరగా పాడయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా వాటి పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంటున్నారు. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం వేడెక్కకుండా రక్షించేందుకు కూలింగ్ ఫ్యాన్ ఉపయోగించడం శ్రేయస్కరమని చెబుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను వాడకంలో చాలా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఎప్పుడైతే వేడెక్కిందని అనిపిస్తోందో వెంటనే దానిని కొద్దిసేపు వాడకం తగ్గించి పక్కన పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే కంప్యూటర్, లాప్టాప్ వంటి వాటిపై వస్త్రాన్ని వేయడం ద్వారా హీట్ ఎక్కకుండా చూడవచ్చని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్