వరద బాధితులకు విపత్తు సాయాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. పెరిగిన సాయం ఎంత అంటే.?

తీవ్రమైన వర్షాలు, వరదలతో ముంపునకు గురైన విజయవాడతోపాటు పలు ప్రాంతాల్లోని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వరద విపత్తు సాయాన్ని భారీగా పెంచింది. భారీ వర్షాలు, వరదలు వల్ల ఆస్తి, పంట నష్టపోయిన బాధితులకు అందించే పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఎండిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ నిబంధనలతో జారీ చేసిన జీవోను సవరిస్తూ వరద బాధితులకు ఉపశమనం కలిగించేలా నూతన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వులు వల్ల వరద బాధితులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.

Flooded Vijayawada

ముంపునకు గురైన విజయవాడ

తీవ్రమైన వర్షాలు, వరదలతో ముంపునకు గురైన విజయవాడతోపాటు పలు ప్రాంతాల్లోని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వరద విపత్తు సాయాన్ని భారీగా పెంచింది. భారీ వర్షాలు, వరదలు వల్ల ఆస్తి, పంట నష్టపోయిన బాధితులకు అందించే పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు గత ప్రభుత్వం ఎండిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ నిబంధనలతో జారీ చేసిన జీవోను సవరిస్తూ వరద బాధితులకు ఉపశమనం కలిగించేలా నూతన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వులు వల్ల వరద బాధితులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు వరదల వల్ల నష్టపోయిన చేనేతలకు అందించే పదివేల రూపాయల సాయాన్ని రూ.25 వేలకు, చేనేతల ముడి సరుకు నష్టానికి అందించే ఐదువేల సాయాన్ని పదివేలకు, వలతో చేపలు పట్టే పడవలు పాక్షికంగా దెబ్బతింటే అందించే రూ.6000 రూపాయలను తొమ్మిది వేలకు, నాన్ మోటర్రైజ్డ్ బోటు పూర్తిగా దెబ్బతింటే ఇచ్చే రూ15 వేలను రూ.20 వేలకు,  మోటర్ రైజ్డ్ బోటు పూర్తిగా దెబ్బతింటే అందించే రూ.20 వేల సాయాన్ని రూ.25 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపల చెరువుల పునరుద్ధరణకు హెక్టార్ కు అందించే రూ.18,000, పట్టు పరిశ్రమకు అందించే రూ.6000 సాయాన్ని రూ.25 వేలకు పెంచింది. ఆవులు, గేదెలు చనిపోతే నష్ట పరిహారంగా అందించే మొత్తం రూ.37,500 సాయాన్ని రూ.50 వేలకు పెంచింది.

ఎద్దులకు రూ.32 వేలు నుంచి నుంచి రూ.40 వేలకు, దూడలకు రూ.20 వేలు నుంచి రూ.25 వేలకు, గొర్రెలు, మేకలకు రూ.4వేలు నుంచి రూ.7500కు పెంచారు. వరి, పత్తి, వేరుశనగ, చెరకు హెక్టార్ కు రూ.17,000 నుంచి రూ.25 వేలకు, రాగులు, సజ్జ, కొర్ర, సాము, ఆముదం, జ్యూట్, నువ్వులకు అందించే రూ.8,500 సాయాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినుము, కంది, సోయా, సన్ ఫ్లవర్, పొగాకుకు అందించే పదివేల సాయాన్ని రూ.15 వేలకు, మొక్కజొన్నకు రూ.12,500 నుంచి రూ.15 వేలకు పెంచారు. మిర్చి హెక్టార్ కు రూ.17 వేల నుంచి రూ.35 వేలకు, టమాట, బొప్పాయి, పూలు, నర్సరీలకు రూ.17,000 నుంచి రూ.25 వేలకు సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా జామకు రూ.22,000 నుంచి రూ.35 వేలకు, మామిడి, దానిమ్మ, సపోటా, అనాస, బత్తాయి, కాఫీ, జీడి, మామిడి, డ్రాగన్ పండ్ల తోటలకు రూ.22,500 నుంచి రూ.35 వేలకు పెంచింది. కొత్తి మీరకు రూ.8,500 నుంచి రూ.25 వేల వరకు నష్ట పరిహారాన్ని అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు చాలా వరకు మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన నిబంధన వల్ల నష్టంలో కొంత భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్