ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య పర్వదినం కావడంతో బుధవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. అయితే భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద బార్ కేడ్లు విరగడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 15 మంది వరకు భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా అధికారులు సమీప ఆసుపత్రులకు తరలించారు.
తొక్కిసలాట సమయంలో భారీగా చేరిన భక్తులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో అత్యంత వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య పర్వదినం కావడంతో బుధవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. అయితే భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద బార్ కేడ్లు విరగడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 15 మంది వరకు భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా అధికారులు సమీప ఆసుపత్రులకు తరలించారు. మౌని అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మిగిలిన భక్తులు తమ పుణ్యస్నానాలను ఆచరించేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లను చేశారు. భారీగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడంతో పాటు స్నానాలను ఆచరించే ఘాట్లవైపు భక్తులను క్రమ పద్ధతిలో అధికారులు పంపిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
భక్తులు భారీ సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేసినప్పటికీ.. ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అన్నదానిపై ప్రస్తుతం ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సుమారు పది కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనాతోనే అధికారులు ఉన్నారు. అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేసినట్లు వెల్లడించారు. అయితే బుధవారం తెల్లవారుజామునే ఈ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకోవడం వెనక కారణాలు ఏమిటి అన్నదానిపైన అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను సెక్టార్-2లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. మౌని అమావాస్య రోజు పుణ్య స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుంది అన్నది భక్తుల విశ్వాసం. ఆ ఉద్దేశంతోనే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సుమారు 10 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే బుధవారం ఒంటిగంట నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమానికి చేరుకొని పుణ్యస్నానాలను ఆచరించారు. అయితే ఒక్కసారిగా భక్తుల సంఖ్య అధికం కావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. భక్తుల సంకిక అనుగుణంగానే అధికారులు సుమారు 12 కిలోమీటర్ల మేర ఘాట్లు సిద్ధం చేశారు. అయినప్పటికీ ఈ ప్రమాదం జరగడంతో సర్వత్ర విస్మయం వ్యక్తం అవుతుంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అధికారులు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఆయన కొద్ది క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.