కెనడాలో భారతీయుల పాత్ర అత్యంత కీలకం.. అనేక రంగాల్లో ప్రభావశీలురుగా ఇండియన్స్

భారత్ - కెనడా మధ్య దౌత్య యుధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య అఘాధం రోజురోజుకు పెరుగుతోంది. ఖలిస్తానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్య నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో నివసిస్తున్న భారతీయులకు సంబంధించిన వివరాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా.? అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయుల గురించి అందిస్తున్న వివరాలు మీకోసం. కెనడాలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. పలు రంగాల్లో స్థిరపడిన భారతీయులు అత్యంత కీలకంగా మారారు.

Students studying in Canada are concerned

కెనడాలో చదువుతున్న విద్యార్థులు ఆందోళన

భారత్ - కెనడా మధ్య దౌత్య యుధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య అఘాధం రోజురోజుకు పెరుగుతోంది. ఖలిస్తానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్య నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో నివసిస్తున్న భారతీయులకు సంబంధించిన వివరాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కెనడాలో నివసిస్తున్న భారతీయులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా.? అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయుల గురించి అందిస్తున్న వివరాలు మీకోసం. కెనడాలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. పలు రంగాల్లో స్థిరపడిన భారతీయులు అత్యంత కీలకంగా మారారు. అనేక రంగాల్లో భారతీయులు లేనిదే పని జరగని పరిస్థితి నెలకొంది. కెనడాలో మొత్తంగా 28 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ప్రవాసులు, భారత సంతతి వారు ఉన్నారు. ప్రపంచంలో భారతీయులు అధికంగా ఉన్న నాలుగో దేశం కెనడా. ఇందులో 18 లక్షల మంది భారత సంతతి వారు కాగా, 10 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. 8.30 లక్షల మంది కెనడాలోని హిందువులు కాగా, 7.70 లక్షల మంది సిక్కులు ఉన్నారు. ప్రవాసులు అధికంగా నివసించే ప్రాంతాల్లో వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్, ఒట్టావా, కాల్గారి వంటి ప్రాంతాల్లో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్నారు. అనేక రంగాల్లో భారతీయులు గణనీయమైన స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నారు. కెనడాలోని శాశ్వత నివాసితుల్లో భారతీయులు 27 శాతంగా ఉన్నారు. కెనడా పీఆర్ స్కీమ్ లో భారతీయులే ప్రధాన లబ్ధిదారులు.

గతేడాది కెనడా వెళ్లిన తాత్కాలిక విదేశీ కార్మికుల్లో భారతీయులు 22 శాతం మంది ఉన్నారు. రెండో అత్యధికం భారతీయులే కావడం గమనార్హం. విదేశీ విద్యార్థుల్లో భారతీయులు 45 శాతంగా ఉన్నారు. మరే దేశం నుంచి ఈ స్థాయిలో విద్యార్థులు కెనడాకు వెళ్లడం లేదు. గడిచిన 20 ఏళ్లలో కెనడాలో భారతీయుల సంఖ్య రెట్టింపును మించింది. 1980 వరకు భారత్ లో పుట్టి కెనడా వెళ్ళిన వారు 63,535 కాగా, 1991 నుంచి 2000 మధ్య ఈ సంఖ్య 1.45 లక్షలకు చేరింది. 2006 నుంచి 2010 మధ్య 1.19 లక్షలు, 2016 నుంచి 2021 మధ్య 2.46 లక్షలకు చేరింది. గడిచిన ఐదేళ్ల అంటే 2019లో కెనడాలోని భారతీయుల విద్యార్థుల సంఖ్య 2.18 లక్షల కాగా, ప్రస్తుతం 4.27 లక్షలకు చేరింది. అంటే ఐదేళ్లలో రెట్టింపు అయింది. ఇక కెనడా పౌరులుగా మారుతున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ శాతం 2017లో 44.3% కాగా, 2021లో 61.1 శాతానికి పెరిగింది. కెనడాలోని భారతీయుల జాబ్ ప్రొఫైల్ కూడా బాగుంది. గత కొన్నాళ్లుగా మరింత మెరుగుపడుతోంది కూడా. ప్రవాస భారతీయుల్లో 50 శాతం మంది డిగ్రీ హోదాతో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం మీద కార్యనిర్వాహక పోస్టుల్లో పది శాతంలోపే ఉన్నారు. ఇటీవల వెళ్ళిన వారిలో కొంత మంది 19 శాతం మంది ఈ పోస్టులు పొందారు. భారత్ కు పప్పు ధాన్యాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం కెనడా. భారత్ నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలు, ఫార్మా ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు అధికంగా కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. భారత్ లో ఉన్న కెనడాకు చెందిన కంపెనీలు 600కుపైగానే ఉన్నాయి. వీటిలో టిమ్ హార్టన్స్ కాఫీ చైన్, శీతల ఆహార పదార్థాల సంస్థ మెక్ కేయిన్ కూడా ఉన్నాయి. 75 బిలియన్ అమెరికా డాలర్లకుపైగా కెనడి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్