పైకి ఎగబాకుతున్న వెండి, బంగారం ధరలు.. లక్ష దాటిన కేజీ వెండి

దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బులియన్ ధరలు మరింత ఎగబాకి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం మరో రూ.350 పెరిగి రూ.81 వేలకు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరుగుదలతో రూ.1.01 లక్షకు చేరింది. వెండి రేటు కూడా వరుసగా పెరుగుతూ వస్తుంది. వెండి రేటు పెరగడం వరుసగా ఇది ఐదో రోజు. అంతేకాదు ఢిల్లీ మార్కెట్ లో వెండి లక్ష మైలు రాయిని చేరడం ఇదే తొలిసారి.

gold

బంగారం

దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బులియన్ ధరలు మరింత ఎగబాకి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మంగళవారం మరో రూ.350 పెరిగి రూ.81 వేలకు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.1500 పెరుగుదలతో రూ.1.01 లక్షకు చేరింది. వెండి రేటు కూడా వరుసగా పెరుగుతూ వస్తుంది. వెండి రేటు పెరగడం వరుసగా ఇది ఐదో రోజు. అంతేకాదు ఢిల్లీ మార్కెట్ లో వెండి లక్ష మైలు రాయిని చేరడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటి ధరలు సరికొత్త జీవితకాల గరిష్టానికి పెరగడంతోపాటు పండగ సీజన్ నేపథ్యంలో ఆభరణ వర్తకులు, స్టాకిస్టులు బులియన్ కొనుగోలు పెంచడం ఎందుకు కనవే మాట్లాడటం కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశలో 0.53 శాతం పెరుగుదలతో 2,753.30 డాలర్లు, సిల్వర్ 1.74 శాతం వృద్ధితో 34.675 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. తాజాగా బంగారం వెండి రేట్లు పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందంటూ పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఒకే బంగారం రేటును అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆల్ ఇండియా జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జిజేసి) వెల్లడించింది.

ప్రస్తుతం  రేటు నగరాన్ని బట్టి మారుతోంది. బంగారాన్ని ఒకే రేటుకు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ విక్రయ ధర మాత్రం నగరాన్ని బట్టి మారుతోంది. ఇకపై దేశమంతా ఒకే రేటు అమలు చేసేందుకు బులియన్ మార్కెట్ సభ్యులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు జిజేసి కార్యదర్శి మితేష్ దొర్ఖ తెలిపారు. ఇదిలా ఉంటే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరగడం, పండగ సీజన్ ఆభరణ విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ధన త్రయోదశి, దీపావళికి ఆభరణాలకు గిరాకీ గణనీయంగా తగ్గవచ్చని పేర్కొంటున్నారు. పెరిగిన ధరల వల్ల ఈసారి సేల్స్ విలువ 12 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ విక్రయాల పరిమాణం 10 నుంచి 12 శాతం వరకు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. పండగ సీజన్లకు ముందే బంగారం ధర భారీగా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీవనకాల గరిష్ట స్థాయిలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఉన్నాయి. వరుసుగా ధరలు పెరుగుకుంటూ పోతుండడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఐదు రోజులు ధరలు పెరగడం మరింత ఆందోళనకు కారణం అవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ప్రస్తుతం గోల్డ్ ధరలు ఫ్లాట్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ 18, 19 తేదీల్లో వెండి ధర రూ.2500 పెరిగింది. హైదరాబాదు నగరంలో వెండి ధర అయితే మరో రూ.2000 పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా తొమ్మిది వెలుగా ఉంది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలో హెచ్చు, తగ్గులు ఉన్నాయి. స్థానిక పన్నులు కారణమవుతున్నట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్