పైకి ఎగబాకుతున్న పసిడి ధరలు.. దీపావళి నాటికి 78 వేలకు చేరిక.?

పసిడి ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో రాబోయే కాలంలో బంగారం ధరలు మరింత తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికన్ ఫెడరల్ వడ్డీ రేటును తాజాగా 0.50 శాతం తగ్గించడంతోపాటు ఈ ఏడాది చివరి నాటికి మరో అర శాతం, 2025లో ఒక శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని సంకేతాలను ఇచ్చింది.

gold

పసిడి 

పసిడి ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించిన నేపథ్యంలో రాబోయే కాలంలో బంగారం ధరలు మరింత తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికన్ ఫెడరల్ వడ్డీ రేటును తాజాగా 0.50 శాతం తగ్గించడంతోపాటు ఈ ఏడాది చివరి నాటికి మరో అర శాతం, 2025లో ఒక శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని సంకేతాలను ఇచ్చింది. ఇది భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగేదానికి అవకాశాలను ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ఆల్ టైమ్ గరిష్టలు వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది స్వల్పకాలికంగా దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలున్నప్పటికీ రాబోయే కాలంలో మాత్రం ధరలు మరింత ఎగబాకనున్నాయని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం 2,650 డాలర్ల స్థాయికి, దేశీయంగా తులం బంగారం రూ.78 వేలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సాధారణంగా ఫెడ్ రేట్లు, బులియన్ దరలది విలోమ సంబంధం. ఫెడ్ రేట్లు పెరుగుతున్నప్పుడు విలువైన లోహాల ధరలు తగ్గుతాయి. ఫెడ్ రేట్ల తగ్గుదల సమయంలో బులియన్ ధరలు ఎగబాకుతాయి. ఫెడ్ దూకుడుగా వడ్డీ రేట్లు తగ్గిస్తే గనుక వచ్చే ఏడాది జూన్ నాటికి ఔన్స్ గోల్డ్ మూడు వేల డాలర్లు స్థాయికి చేరుకున్న ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయ మార్కెట్లో గురువారం బులియన్ రేట్లు మరింత ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరుగుదలతో రూ.75,650 కి చేరుకుంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.91 వేలకు చేరింది. ఫెడ్ రేట్లు తగ్గడంతో అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు దేశీయంగా ఆభరణాల వర్తకులు వీటి కొనుగోలు పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. రూపాయి బలోపేతం దేశీయంగా బులియన్ ర్యాలీని పరిమితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ (31.10) గ్రాముల బంగారం ధర ఒక దశలో 0.45 శాతం పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయి 2,610.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి కూడా 2.58 శాతం వృద్ధితో 31.48 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటు తగ్గుతున్న ప్రతిసారి బంగారం ధరలు భారతదేశంలో భారీగా పెరుగుతుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ ధరలను పలుకుతున్న బంగారం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని, ఆ స్థాయికి బంగారం ధరలు వెళ్ళనున్నాయని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్