భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గింది అంటే.!

గడిచిన కొన్నాళ్లుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు భారీ మొత్తంలో తగ్గుముఖం పట్టడంతో బంగారు ప్రియుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం గరిష్టంగా రూ.2080 తగ్గి పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది.

gold

బంగారం


గడిచిన కొన్నాళ్లుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు భారీ మొత్తంలో తగ్గుముఖం పట్టడంతో బంగారు ప్రియుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం గరిష్టంగా రూ.2080 తగ్గి పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు తక్కువ పట్టడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడ తో పాటు గుంటూరు ప్రొద్దుటూరు బెంగళూరు ముంబై వంటి ప్రాంతాల్లో కూడా తులం బంగారం ధర రూ.65700 (22 క్యారెట్) గా వుంది. శుక్రవారం నాటి ధరలతో పోలిస్తే శనివారం ఏకంగా రూ.1900 నుంచి రూ.2080 వరకు తగ్గింది. చెన్నైలో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,500, 24 క్యా పది గ్రాముల బంగారం రూ.72,550 గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేట్లు పడిపోయాయి. శుక్రవారం నాటి ధరలతో పోలిస్తే శనివారం రూ.2000 వరకు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో బంగారం ధరలు మాదిరిగానే వెండి కూడా భారీగా తగ్గింది. శనివారం కేజీ వెండి ధర రూ.91,500 వద్ద ఉంది. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం ఏకంగా రూ.4500 వరకు తగ్గినట్లు తెలుస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్