రాజకీయాల్లో హుందాతనం పోయింది. ఒకప్పుడు హుందాతో కూడిన రాజకీయాలను ఎంతోమంది నేతలు సాగించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను చాలామంది చులకన చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. మాటలు తారాస్థాయికి చేరుతుండడంతో కొంతమంది నేతలు పరువు నష్టం కేసులు వేసుకుంటూ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితికి రాజకీయాలను తీసుకువెళుతున్నారు.
కేటీఆర్, బండి సంజయ్
రాజకీయాల్లో హుందాతనం పోయింది. ఒకప్పుడు హుందాతో కూడిన రాజకీయాలను ఎంతోమంది నేతలు సాగించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను చాలామంది చులకన చేసే పరిస్థితికి తీసుకువచ్చారు. మాటలు తారాస్థాయికి చేరుతుండడంతో కొంతమంది నేతలు పరువు నష్టం కేసులు వేసుకుంటూ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితికి రాజకీయాలను తీసుకువెళుతున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఈ తరహా వాతావరణం పెరిగిపోయింది. నేతల మధ్య పరస్పర ఆరోపణలు పరిధి దాటిపోవడంతో లీగల్ నోటీసులు ఇచ్చుకునే స్థితికి వెళుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ పలువురుపై పరువు నష్టం దావాలు వేయగా, ఆయనపై కూడా కొందరు పరువు నష్టం దావాలను కోర్టులో వేశారు. తాజాగా కేటీఆర్ బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసినట్లు చెబుతున్నారు. తనకు వారంలోగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. దీనికి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ తనపై ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.
తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని లేకపోతే లీగల్గా తాను తీసుకునే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ తో లీగల్ గానే పోరాడుతానని బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. ఎందుకు తాను కూడా సిద్ధమేనని మరోసారి రియాక్ట్ అయ్యారు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాటకు మాట నోటీసుకు నోటీసుతోనే జవాబు ఇస్తానంటూ బండి సంజయ్ ప్రకటించడంతో వీరి మధ్య వార్ మరింత హీట్ పెంచింది. ఇక కొద్ది రోజుల కిందట మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పరువు నష్టం దావాను వేశారు కేటీఆర్. సమంత విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. దీనికి సంబంధించి ఆయన న్యాయపరంగానే పోరాడేందుకు సిద్ధపడ్డారు. అందుకు అనుగుణంగానే ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరైన ఆయన కొండా సురేఖ మాట్లాడిన మాటలకు సంబంధించిన కొన్ని వీడియోలను కోర్టుకు అందించారు. తన వాంగ్మూలాన్ని కూడా సమర్పించారు. ఇకపోతే అమృత పథకం టెండర్ల విషయంలో తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ కు సృజన్ రెడ్డి గత నెలలో లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్, టిఆర్ఎస్ పార్టీకి నోటీసులను ఇచ్చారు. తప్పుడు వ్యాఖ్యలు వెనక తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ తరహా లీగల్ నోటీసులు ఎక్కువ అవుతుండడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పరిధి దాటి మాట్లాడటం వల్లే కోర్టులు వరకు నేతలు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు.