జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు, రేప్ కేసు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జనసేనకు మద్దతుగా గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పై విమర్శల చేసినప్పటి నుంచి ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చారు తాజాగా మరోసారి ఆయన పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసును పెట్టారు.

Johnny master

జానీ మాస్టర్ 

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జనసేనకు మద్దతుగా గతంలో అధికారంలో ఉన్న వైసీపీ పై విమర్శల చేసినప్పటి నుంచి ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చారు తాజాగా మరోసారి ఆయన పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసును పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జానీ మాస్టర్ తనని కొంతకాలంగా వేధిస్తున్నారని, తనమీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ 20 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ఫిర్యాదు చేసిన మహిళ నృత్య దర్శకురాలు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన అమ్మాయి ఆయనతోపాటు కొన్ని సినిమాలకు పని చేసింది. ఈ క్రమంలోనే సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్లినప్పుడు అవుట్ డోర్ షూటింగ్ చేసే సమయంలో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళ ఆ ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ సిటీలోని నార్సింగ్ లోని తన నివాసంలో కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో సదరు మహిళ వెల్లడించింది. జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన మహిళ నార్సింగ్ నివాసి అయినప్పటికీ ఆమె ఫిర్యాదు ఇచ్చింది మాత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును నార్సింగ్ కి బదిలీ చేశారు. జానీ మాస్టర్ మీద అత్యాచారం (సెక్షన్ 376), క్రిమినల్ బెదిరింపులు (సెక్షన్ 506),  స్వచ్ఛందంగా గాయపరచడం (సెక్షన్ 323), లోని క్లాజ్ (2) అండ్ (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్ పై మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో జనసేన తరఫున జానీ మాస్టర్ ప్రచారాన్ని నిర్వహించారు. పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ తరఫున కూడా ప్రచారం చేశారు. అదే సమయంలో అప్పట్లో అధికార వైసిపిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో జరిగిన అనేక లోపాలను ఎత్తి చూపిస్తూ ఒక వీడియో రూపంలో పాటను కూడా విడుదల చేశారు. ఇందులో జనసేనకు మద్దతు తెలియజేసేలా ఆ సాంగ్ ఉంది. అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు జానీ మాస్టర్ ను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఆయనపైన కేసు నమోదు చేయడంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జానీ మాస్టర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో వైసిపి నాయకులు గురించి మాట్లాడిన జన సైనికులు ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహార శైలి గురించి ఏమంటారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎదుటివారిని విమర్శించే ముందు తమ పరిస్థితి ఏమిటో ఆలోచించాలంటూ పలువురు వైసీపీ శ్రేణులు ఆయనకు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జానీ మాస్టర్ ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఆయన మీద సతీష్ అనే మాస్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆనేక ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు. కొందరు లేడీ డాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు ఫోన్ చేసి జానీకి వ్యతిరేకంగా మాట్లాడమని సతీష్ చెబుతున్నట్లు జానీ మాస్టర్ భార్య అలీషా వాపోయారు. దీనిపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వాస్తవాలను పోలీసులే బయటకు వెల్లడించాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం జానీ మాస్టర్  చిక్కుల్లో పడ్డారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్