కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ఆశగా ఎదరుచూస్తున్న ప్రజలకు కొన్నాళ్లుగా అడ్డంకిగా నిలిచిన ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయా.? అన్న ఆశతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గడిచిన కొన్నాళ్ల్ల నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్ది రోజులు కిందట కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రతీకాత్మక చిత్రం
కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ఆశగా ఎదరుచూస్తున్న ప్రజలకు కొన్నాళ్లుగా అడ్డంకిగా నిలిచిన ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతాయా.? అన్న ఆశతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గడిచిన కొన్నాళ్ల్ల నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్ది రోజులు కిందట కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ ప్రక్రియ ప్రారంభమవుతుందా..? అని ఆశగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రేషన్ కార్డులు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. క్యూఆర్ కోడ్‌తో ఉన్న కొత్త స్మార్ట్ కార్డులను ప్రజలకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న కార్డులు ఉపయోగపడతాని అధికారులు భావిస్తున్నారు. వివిధ రకాల డిజైన్లను అధికారులు ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వాటిని చూసి ఫైనల్ చేయనున్నారు.
పూర్తయిన ప్రక్రియ..
తెలంగాణలో కొత్త కార్డులు లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో అనర్హులను వేరు చేసి కొన్నింటిని ప్రభుత్వం ఫైనలైజ్ చేస్తుంది. వాళ్లకు మొదట క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందించనుంది. అనంతరం ఇప్పటికే కార్డులు కలిగిన 90 లక్షల మందికి కూడా కార్డులు మార్చనుంది. అందరికీ స్మార్ట్ కార్డు మాదిరి కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్చి మొదటి వారం నుంచి కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీ చేయాలని భావించారు. అయితే, తొలిసారిగా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు ఇస్తుండడంతో ప్రక్రియ ఆలస్యమైంది. అందుకే స్మార్ట్ కార్డులు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో పాల్గొనే కంపెనీలు మార్చి 25 వరకు టెండర్లు వేయవచ్చు. ప్రీ బిడ్డింగ్ సమావేశం మార్చి 17న నిర్వహించనున్నారు. ఇది ఖరారు అయిన తరువాత రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ రానుంది కొత్తగా వచ్చే స్మార్ట్ కార్డులు ఇంట్లో ఉండే మహిళల పేరుతోనే రానున్నాయి. కార్డుపై ఆమె ఫొటోను ముద్రిస్తారు. ఒకవైపు సీఎం ఫొటో, మరో వైపు పౌరసరఫరాలశాఖ మంత్రి ఫొటో ఉంటుంది. పెద్దగా కార్డు యజమానిరాలి ఫొటో ఉంటుంది.