జనాభా కంటే ఫోన్ల సంఖ్య ఎక్కువ.. సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ.!

తెలంగాణ రాష్ట్రం మరో సరికొత్త రికార్డును సాధించింది. ఈ రాష్ట్రంలో అత్యధిక ఫోన్లు వినియోగిస్తున్న వారు ఉండడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రజలకంటే ఫోన్ల సంఖ్య అధికంగా ఉంది. ఇదే విషయం తాజాగా నిరూపితమైంది. గత కొన్నాళ్ళుగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. తెలంగాణలో కూడా ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒకరికి ఒకటికి మించి ఫోన్లు ఉండడంతో తెలంగాణలో జనాభాకు మించి ఫోన్లు పెరిగిపోయాయి. తెలంగాణలో ప్రస్తుతం ప్రతి వందమంది పౌరులకు 105 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రం మరో సరికొత్త రికార్డును సాధించింది. ఈ రాష్ట్రంలో అత్యధిక ఫోన్లు వినియోగిస్తున్న వారు ఉండడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రజలకంటే ఫోన్ల సంఖ్య అధికంగా ఉంది. ఇదే విషయం తాజాగా నిరూపితమైంది. గత కొన్నాళ్ళుగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. తెలంగాణలో కూడా ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒకరికి ఒకటికి మించి ఫోన్లు ఉండడంతో తెలంగాణలో జనాభాకు మించి ఫోన్లు పెరిగిపోయాయి. తెలంగాణలో ప్రస్తుతం ప్రతి వందమంది పౌరులకు 105 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశ సగటు 82 శాతం మాత్రమే. అంటే దేశంలోని ప్రతి వందమందిలో 82 మంది వద్ద మాత్రమే ఫోన్లు ఉన్నాయి. అయితే తెలంగాణ ఈ రికార్డును అధిగమించింది. ప్రతి వందమంది పౌరులు వద్ద 105 వరకు ఫోన్లు ఉంటున్నట్లు వెళ్లడయింది. వైర్లెస్ టెలి డెన్సిటీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానాన్ని సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నాలుగు కోట్లకుపైగా మొబైల్ ఫోన్లు, మరో 15 లక్షలకు పైగా ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. 3.64 కోట్లకుపైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఏ రకంగానో చూసుకున్న తెలంగాణలో ఫోన్లు వినియోగంతో పాటు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉన్నట్లు తేలింది. దీనికి ప్రధానమైన కారణం ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరగడమేనని చెబుతున్నారు.

అసలు ఫోన్ వాడిని వారి సంఖ్య కూడా ఉన్నప్పటికీ జనాభాపరంగా చూస్తే మాత్రం తెలంగాణలో ప్రజలకంటే అధికంగా ఫోన్లో ఉన్నాయి. ఎక్కువమంది రెండు ఫోన్లు వినియోగిస్తుండడం కొంతమంది మూడు ఫోన్లు కూడా వాడుతుండడంతో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. అలాగని రాష్ట్రంలోని ప్రజలందరూ వద్ద సెల్ఫోన్లు ఉన్నట్లు కాదు. సెల్ఫోన్ లేని వారి సంఖ్య కూడా ఉంది. కానీ పౌరుల సంఖ్యతో పోలిస్తే తెలంగాణలోని ప్రజల వద్ద ఉన్న ఫోన్లు సంఖ్య అధికంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కో ఫోన్కు పరిమితం కాకుండా అధికంగా వినియోగిస్తుండడం వల్లే ఈ రికార్డు సాధ్యమైనట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా తెలంగాణలోని ఫోన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. లక్షలాదిమంది రెండు మూడు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కీ ప్యాడ్ ఫోన్లో వినియోగిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. అదే సమయంలో తెలంగాణలో ల్యాండ్ లైన్ ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉన్నట్లు తేలింది. 15 లక్షలకుపైగా ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ల్యాండ్ లైన్ కనెక్షన్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ గణనీయమైన స్థాయిలోనే ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ సగటుకు మించి రాష్ట్రంలో సెల్ ఫోన్లు వినియోగిస్తున్న వారు ఉండడం, ప్రజలకంటే మొబైల్ ఫోన్లు ఎక్కువగా తెలంగాణ లో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్