సుదీర్ఘంగా కొనసాగుతున్న ఆర్జీవీ విచారణ.. కీలక అంశాలపై పోలీసుల ప్రశ్నల వర్షం

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఒంగోలు పోలీస్‌ స్టేషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరైన ఆయనను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మకు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు సంఘీభావం తెలిపారు. సుమారు ఏడు గంటలు నుంచి ఆయనున్న పోలీసులు విచారిస్తున్నారు. సీఐ శ్రీకాంత్‌ బాబు నేతృత్వంలోని పోలీసు అధికారులు బృందం ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సాగుతున్న ఈ విచారణలో భాగంగా అనేక ప్రశ్నలను సంధించినట్టు తెలుస్తోంది.

Ramgopal Verma attending the hearing

విచారణకు హాజరవుతున్న రామ్‌గోపాల్‌ వర్మ

ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఒంగోలు పోలీస్‌ స్టేషన్‌కు శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరైన ఆయనను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మకు వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు సంఘీభావం తెలిపారు. సుమారు ఏడు గంటలు నుంచి ఆయనున్న పోలీసులు విచారిస్తున్నారు. సీఐ శ్రీకాంత్‌ బాబు నేతృత్వంలోని పోలీసు అధికారులు బృందం ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సాగుతున్న ఈ విచారణలో భాగంగా అనేక ప్రశ్నలను సంధించినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఎక్స్‌లో పోస్టు చేసిన వ్యవహారంపై పోలీసులు కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. దీనిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానంగా.. తన ఎక్స్‌లో నుంచే ఆ పోస్టింగ్స్‌ చేసినట్టు ఒప్పుకున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఆ పోస్టింగ్స్‌ చేసినట్టు ఆర్జీవీ అంగీకరించారు. కానీ, ఆ పోస్టింగ్స్‌తో వైసీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఫైవర్‌ నెట్‌ నుంచి రెండు కోట్ల రూపాయలు ఆర్జీవీకి కేటాయించడంపైనా పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించారు. రెండు కోట్ల కేటాయింపుపై రామ్‌గోపాల్‌ వర్మ ఎటువంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపైనా పోలీసులు ప్రశ్నలు వేయగా.. వారితో తనకు వ్యక్తిగత సంబంఽధాలు మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు. ఐదు గంటలకు తరబడి పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో వైపు పోలీసుల విచారణకు రావడానికి ముందు వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు ఆర్జీవీని కలిశారు. ఈ కలయికకు సంబంధించి కూడా పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈ విచారణ మరో రెండు, మూడు గంటలు ఉంటుందని తెలుస్తోంది. రెండోరోజూ విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా..? లేక ఒక్కరోజుతోనే విచారణ ముగుస్తుందా..? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణ తరువాత వర్మ మీడియాతో మాట్లాడే అంశాలపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఎలా స్పందిస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్